వెనిజులాలో అగ్రరాజ్యాల ఆధిపత్యం! | Russia confirms its military personnel arrived in Venezuela | Sakshi
Sakshi News home page

వెనిజులాలో అగ్రరాజ్యాల ఆధిపత్యం!

Mar 28 2019 4:56 AM | Updated on Mar 28 2019 4:56 AM

Russia confirms its military personnel arrived in Venezuela - Sakshi

మాస్కో: ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న వెనిజులాలో రష్యా సైన్యం అడుగుపెట్టింది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్‌ మదురోకు మద్దతుగా తమ సైన్యం ఆ దేశానికి చేరుకున్నట్లు రష్యా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మారియా తెలిపారు. ఇరుదేశాల మధ్య కుదిరిన సైనిక సహకార ఒప్పందం మేరకే తాము వ్యవహరిస్తున్నామని స్పష్టం చేశారు. వెనిజులాలో ఉండే ప్రతీ హక్కు రష్యా సైన్యానికి ఉందని తేల్చిచెప్పారు. అయితే వెనిజులాకు ఎంతమంది రష్యా సైనికులు చేరుకున్నారన్న విషయమై మారియా స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న అమెరికా–రష్యా సంబంధాలు మరింత దిగజారనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement