విస్తరిస్తున్న రోహింగ్యాలు | Sakshi
Sakshi News home page

విస్తరిస్తున్న రోహింగ్యాలు

Published Thu, Sep 21 2017 8:05 PM

Rohingyas expanding

  • శాటిలైట్‌ ఇమేజ్‌లో మరింత స్పష్టత
  • క్యాంపుల్లోనూ.. పెరిగిన శరణార్థులు

  • ఢాకా : మయన్మార్‌ నుంచి వచ్చిన రోహింగ్యా శరణార్థులు దక్షిణ బంగ్లాదేశ్‌లో పూర్తిగా విస్తరిస్తున్నారు. ఇదే విషయాన్ని శాటిలైట్‌ చిత్రాలు కూడా ధృవీకరిస్తున్నాయి. రోహింగ్యాలు.. రాకముందు.. వచ్చిన తరువాత అంటూ.. తాజా కొన్ని చిత్రాలను డిజిటల్‌ గ్లోబ్‌ విడుదల చేసింది. శరణార్థులు లేని రోజుల్లో అంటే మే నెల్లో పరిస్థితులను.. ప్రస్తుతం నెలకొన్న స్థితిని ఈ చిత్రలు వివరిస్తాయి.

    మయన్మార్‌లోని ఉద్రిక్త పరిస్థితుల నడుమ.. రోహింగ్యా ముస్లింలు సుమారు 4 లక్షల 20 వేల మంది బంగ్లాదేశ్‌కు శరణార్థులుగా వచ్చారు.  వీరు రాకముందు.. బంగ్లా దక్షిణ ప్రాంతం నిర్జనారణ్యంగా ఉండేదని.. ప్రస్తుతం ఆ ప్రాంతమంతా జనారణ్యంగా మారిందని.. కొలరాడోకు చెందిన సీనియర్‌ ఫొటో ఎనలిస్ట్‌ స్టీఫెన్‌ వుడ్‌ చెప్పారు. ఈ చిత్రాలను అంతరిక్షం నుంచి హై-రెజుల్యూషన్‌ కెమెరాలతో తీసినట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం రోహింగ్యాలు ఉంటున్న ప్రాంతంలో ఒక భారీ ట్రాఫిక్‌ జామ్‌ను చూడొచ్చని.. ఇది శరణార్థులకు మౌలిక, ఆహార పదార్థాలను అందించే వాహనాలు అయి ఉండొచ్చని ఆయన చెప్పారు.


Advertisement
Advertisement