భారతీయుడికి ప్రతిష్టాత్మక అవార్డు | Prajapati Trivedi Awarded In US | Sakshi
Sakshi News home page

భారతీయుడికి ప్రతిష్టాత్మక అవార్డు

Mar 12 2019 9:27 AM | Updated on Apr 4 2019 3:25 PM

Prajapati Trivedi Awarded In US - Sakshi

ఈ పురస్కారాన్ని పొందిన తొలి భారతీయుడు ప్రజాపతే.

న్యూఢిల్లీ: లండన్‌లోని కామన్వెల్త్‌ సెక్రటేరియట్‌లో సీనియర్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న భారతీయుడు ప్రజాపతి త్రివేదికి ప్రతిష్టాత్మక ‘హ్యారీ హాట్రీ డిస్టింగ్యూష్‌డ్‌ పర్ఫార్మెన్స్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాక్టీస్‌ అవార్డ్‌’ దక్కింది. ప్రజాపాలన విభాగంలో ఆయన సేవలకు గుర్తింపుగా 2019 ఏడాదికి ఈ అవార్డును ప్రజాపతికి బహూకరించారు. ఆదివారం వాషింగ్టన్‌లో జరిగిన వేడుకలో సెంటర్‌ ఫర్‌ అకౌంటబిలిటీ అండ్‌ పర్ఫార్మెన్స్‌ (సీఏపీ), అమెరికన్‌ సొసైటీ ఫర్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఏఎస్‌పీఏ) ఈ అవార్డును ప్రజాపతికి ప్రదానం చేశాయి.

ఈ అవార్డును ప్రతి ఏడాదీ ప్రజాపాలన విభాగంలో గణనీయ మార్పులు తెచ్చేందుకు కృషి చేసే వారికి ఇస్తారు. ఈ పురస్కారాన్ని పొందిన తొలి భారతీయుడు ప్రజాపతే. ఇప్పటి వరకు తాను పొందిన అన్ని అవార్డుల్లోకెల్లా ఈ అవార్డు తనకు ఎంతో విలువైనదని ప్రజాపతి తెలిపారు. 2009–14 మధ్య కాలంలో ప్రజాపతి భారత పీఎంవోలో శాశ్వత కార్యదర్శిగా పనిచేశారు. అంతకు ముందు ఆయన అంతర్జాతీయంగా, దేశీయంగా పలు ప్రతిష్టాత్మక సంస్థల్లో పనిచేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement