మరోసారి పోలియో పడగ | Polio outbreak in Ukraine, first cases in Europe since 2010 | Sakshi
Sakshi News home page

మరోసారి పోలియో పడగ

Sep 3 2015 11:02 AM | Updated on Sep 3 2017 8:41 AM

మరోసారి పోలియో పడగ

మరోసారి పోలియో పడగ

ఉక్రెయిన్లో రెండు పోలియో కేసులు నమోదయ్యాయి. ఓ పదేళ్ల బాలికకు, నాలుగేళ్ల చిన్నారికి పోలీయో సోకినట్లు ఉక్రెయిన్ వైద్యాధికారులు ధృవీకరించారు.

కీవ్: ఉక్రెయిన్లో రెండు పోలియో కేసులు నమోదయ్యాయి. ఓ పదేళ్ల బాలికకు, నాలుగేళ్ల చిన్నారికి పోలియో సోకినట్లు ఉక్రెయిన్ వైద్యాధికారులు ధృవీకరించారు. దీంతో గత 2010 నుంచి ఇప్పటి వరకు యూరప్లో తొలి పోలియో కేసు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూ హెచ్ఓ) తెలిపింది. కాగా, చిట్టచివరిగా ఉక్రెయిన్లో మాత్రం 1996లో పోలియో కేసు నమోదైనట్లు వెల్లడించింది. తాజాగా నమోదైన రెండు కేసులు కూడా ఉక్రెయిన్లోని జకర్పాట్యా ప్రాంతానికి చెందినవి.

దీంతో ఆ ప్రాంతంలో మరోసారి పోలియో నివారణ చర్యలకు కోసం తామే ప్రత్యేకంగా శ్రద్ధ వహించినట్లు డబ్ల్యూ హెచ్ఓ తెలిపింది. ఇటీవల కాలంలో ఆ ప్రాంతంలో వ్యాక్సిన్ చేరవేయడంలో నిర్లక్ష్యం వహించడంతోపాటు పంపించే ప్రాంతాలకు కూడా తక్కువ మోతాదులో పంపించడం వల్లే తాజాగా పోలియో వైరస్ బయటకు రావడానికి కారణమైందని వెల్లడించింది. ఇప్పటికే ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు పోలియో రహిత దేశాలుగా నమోదవ్వగా తాజాగా తలెత్తిన పరిస్థితి మరోసారి పునఃపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement