కనిపించని ఓ సూపర్‌ ఎర్త్‌.. ప్లానెట్‌–9

Planet Nine Could Be Our Solar System's Missing 'Super Earth'

వాషింగ్టన్‌: సౌర వ్యవస్థలో ఉనికిలో ఉందని భావిస్తున్న ప్లానెట్‌–9 గ్రహానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ గ్రహం బరువు భూమి కంటే 10 రెట్లు ఎక్కువగాను, సూర్యుడి నుంచి నెప్ట్యూన్‌ కంటే 20 రెట్లు దూరంలోనూ ఉన్నట్లు తాజా అధ్యయనంలో బయటపడింది. కనిపించకుండా దోబూచులాడుతున్న ఈ ప్లానెట్‌–9 గ్రహాన్ని కనపించని ఓ సూపర్‌ ఎర్త్‌గా శాస్త్రవేత్తలు అభివర్ణించారు.

అయితే బరువులో మంచు గ్రహాలైన యూరేనస్, నెప్ట్యూన్‌ కంటే ప్లానెట్‌–9 గ్రహం బరువు తక్కువని పరిశోధకులు చెబుతున్నారు. ఈ గ్రహ ఉనికికి సంబంధించి ఇప్పటివరకు సరైన ఆధారాలు లేవని, అయితే ప్రస్తుతం ఆ గ్రహ ఉనికిని తెలిపే 5 పరిశీలనాత్మక ఆధారాలు లభించాయని అమెరికాలోని కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి చెందిన ప్లానెటరీ ఆస్ట్రోఫిజియిస్ట్‌ కాన్‌స్టాంటిన్‌ బాజిన్‌ వివరించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top