పావురం సిక్స్‌ ప్యాక్‌ ట్రైనింగ్‌ అదిరింది | Sakshi
Sakshi News home page

ఎగరటం మర్చిపోయిన పావురం

Published Mon, Jun 1 2020 3:04 PM

Pigeon Uses Escalator Handrail As A Treadmill Video Viral On Social Media - Sakshi

బుర్రకు దెబ్బ తగిలి సంజయ్‌ రామస్వామి గతాన్ని మర్చిపోయి గజినీ అయినట్లు. ఈ పావురం ఎగరటం మర్చిపోయి సోషల్‌ మీడియా సెలబ్రిటీ అయిపోయింది. హోమ్‌ జిమ్‌ చేయాలనుకునే వారికి స్పూర్తిగా నిలుస్తోంది. కొద్దిరోజుల క్రితం ఓ పావురం ఎగరటం మార్చిపోయినట్లు ఎస్కలేటర్‌ హ్యాండ్‌డ్రేల్‌ను పైకి వెళ్లటానికి ఉపయోగించుకుంది. మొదట దానిపై కూర్చుని కిందకు జారిన అది ఆ తర్వాత ట్రేడ్‌మిల్‌పై మనిషి పరిగెత్తినట్లు, హ్యాండ్‌డ్రేల్‌పై పరిగెత్తింది. చివరకు అలుపొచ్చి ఎడమవైపు దానిపైకి దూకింది. అక్కడకూడా పరుగులు పెట్టి, చివరగా కుడివైపు హ్యాండ్‌డ్రేల్‌పైకి వచ్చేసింది. అప్పుడు మాత్రం తను అనుకున్న గమ్యస్థానం వైపు అది వెళుతున్నందుకు గమ్మున ఉండిపోయింది. ( ఏమి ఆట: కరోనా కాలంలో బొమ్మలాట! )

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వేల సంఖ్యలో వీక్షణలు, దాదాపు 700 కామెంట్లు సంపాదించుకుంది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ పావురం ఎగరటం మర్చిపోయిందా?.. పావురం సిక్స్‌ ప్యాక్‌ ట్రైనింగ్‌ అదిరింది.. నేను ఈ మధ్య కాలంలో చూసిన బెస్ట్‌ వీడియో ఇదే!.. పావురానికి ట్రెడ్‌మిల్‌గా మారిన ఎస్కలేటర్‌ను చూడండి.’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement