'గే' చేతికి అమెరికా ఆర్మీ పగ్గాలు? | Obama nominates gay man to lead US Army | Sakshi
Sakshi News home page

'గే' చేతికి అమెరికా ఆర్మీ పగ్గాలు?

Sep 19 2015 9:05 AM | Updated on Sep 3 2017 9:38 AM

'గే' చేతికి అమెరికా ఆర్మీ పగ్గాలు?

'గే' చేతికి అమెరికా ఆర్మీ పగ్గాలు?

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సంచలన నిర్ణయం తీసుకున్నారు.

వాషింగ్టన్:  అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా ఆర్మీ పగ్గాలు ఓ 'గే'(స్వలింగ సంపర్కుడు) చేతికి అప్పగించేందుకు సిద్ధమయ్యారు. యూఎస్ తదుపరి ఆర్మీ సెక్రటరీగా  'గే' అయిన ఎరిక్ ఫాన్నింగ్ను బరాక్ ఒబామా నామినేట్ చేశారు. ప్రస్తుతం ఎరిక్ యూఎస్ అండర్ సెక్రటరీ ఆఫ్ ఆర్మీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

సెనెట్ కూడా ఆమోదం తెలిపితే 'గే' గా బయటకు చెప్పుకొని యూఎస్ ఆర్మీకి సారధ్యం వహించిన మొదటి వ్యక్తి ఎరిక్ అవుతాడు. ఎరిక్కు యూఎస్ ఆర్మీలో ఉన్న అపారమైన అనుభవం, అసాధారణమైన నాయకత్వ లక్షణాలు కొత్త బాధ్యతలు అప్పగించేలా చేశాయని ఒబామా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యూఎస్ ఆర్మీని ప్రపంచంలోనే ఉన్నత స్థానంలో నిలపడానికి ఎరిక్తో కలిసి పని చేస్తామని ఒబామా తెలిపారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement