పెరూలో దిగిన ఒబామా.. ఇదే ఆఖరి టూర్ | Obama arrives in Peru in last stop on final world tour | Sakshi
Sakshi News home page

పెరూలో దిగిన ఒబామా.. ఇదే ఆఖరి టూర్

Nov 19 2016 12:36 PM | Updated on Sep 4 2017 8:33 PM

పెరూలో దిగిన ఒబామా.. ఇదే ఆఖరి టూర్

పెరూలో దిగిన ఒబామా.. ఇదే ఆఖరి టూర్

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పెరూలో అడుగుపెట్టారు.

లిమా: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పెరూలో అడుగుపెట్టారు. అధ్యక్ష స్థానంలో ఉండి చివరగా చేస్తున్న విదేశీ పర్యటనలో భాగంగా బెర్లిన్ నుంచి బయలుదేరిన ఆయన ప్రయణిస్తున్న ప్రత్యేక విమానం ఎయిర్ ఫోర్స్ వన్ పోర్చుగల్లో ఇంధనం నింపుకొని శుక్రవారం సాయంత్రం లిమాలో దిగింది. పెరూలో అధ్యక్షుడు పెడ్రో పబ్లో కుస్జిన్స్కీతో సమావేశం ద్వారా ఆయన తన షెడ్యూలును ప్రారంభిస్తారు.

అనంతరం టౌన్ హాల్లో వందలమంది యువకుల మధ్య ప్రసంగించనున్నారు. ఇక్కడే ఆయన చివరగా చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆదివారం లిమాలో జరగనున్న ఆర్థిక సదస్సులో ఆసియా ప్రాంత నాయకులను, ఆస్ట్రేలియా నాయకుడిని ఒబామా కలవనున్నారు. అనంతరం పత్రికా సమావేశం నిర్వహించి తిరిగి సోమవారం ఉదయం శ్వేత సౌదానికి చేరుకుంటారు. దీంతో ఒబామా పర్యటనలు పూర్తి కానున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement