హోదా కోసం ఎన్నారైల నిరసన | NRI protest For AP special status | Sakshi
Sakshi News home page

హోదా కోసం ఎన్నారైల నిరసన

Sep 12 2016 5:33 PM | Updated on Jul 6 2019 12:42 PM

హోదా కోసం ఎన్నారైల నిరసన - Sakshi

హోదా కోసం ఎన్నారైల నిరసన

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని అమెరికాలోని ఎన్నారైలు నిరసన వ్యక్తంచేశారు.

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని అమెరికాలోని ఎన్నారైలు నిరసన వ్యక్తంచేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన బంద్ పిలుపులో భాగంగా.. సెప్టెంబర్ 10న అమెరికాలో వైఎస్సార్ సీపీ ఎన్నారై విభాగం నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసింది.  కాలిఫోర్నియా రాష్ట్రంలోని ప్రిమాంటోలో 'ప్రత్యేక హోదా - ఆంధ్రుల హక్క'ని ఎన్నారైలు నినదించారు. తాము అధికారంలోకి వస్తే.. వెంటనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని వాగ్దానం చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ఇప్పుడు మాటమార్చడం సరికాదన్నారు.

 హోదా వీలుకాదని.. ప్యాకేజీ మాత్రమే ఇస్తామని చెప్పడం దారుణమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు.. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు శాపంగా మారబోతోందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రత్యేక హోదా కోసం ప్రజలంతా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.  వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, పార్టీ ఎన్నారై విభాగం కన్వీనర్ మధులిక ల ఆద్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. అమెరికాలోని తెలుగు వారందరినీ సమీకరించి.. హోదా కోసం ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాజ్ కేసిరెడ్డి, కేవీ రెడ్డి, సురేష్ ఉయ్యూరు, సురేంద్ర అబ్బవరం, కొండారెడ్డి, రెడ్డివారి సుబ్రహ్మణ్యం, ప్రవీణ్ రెడ్డి, రాజేశ్, వెన్నా వెంకటేశ్వర రెడ్డి, రామ్మోహన్, నరేష్ ఆనంద్, ఉమాశంకర్, శంకర రెడ్డి, రవి కర్రి, రవిచంద్రారెడ్డి, శ్రీనివాస్, విజయ్ పద్దుల, శ్రీధర్ రెడ్డి, వీరబాబు పత్తిపాటి, సురేంద్ర పులగం తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement