
'గే'లకు వాటితో డేంజరే..
వాషింగ్టన్: అమెరికా ఖండంలోని పలు దేశాల్లో 'గే' (స్వలింగ సంపర్కుల)లకు వ్యతిరేకంగా చేసిన చట్టాలు చాలా అపాయకరంగా ఉన్నాయని ఆపిల్ కంపెనీ చీఫ్ టిమ్ కుక్ అన్నారు.
వాషింగ్టన్: అమెరికా ఖండంలోని పలు దేశాల్లో 'గే' (స్వలింగ సంపర్కుల)లకు వ్యతిరేకంగా చేసిన చట్టాలు చాలా అపాయకరంగా ఉన్నాయని ఆపిల్ కంపెనీ చీఫ్ టిమ్ కుక్ అన్నారు. ఇలాంటి చట్టాలు స్వలింగ సంపర్కుల విషయంలో పూర్తి పక్షపాతం చూపేలా చేస్తాయని, సమానత్వాన్ని హరిస్తాయని ఆయన ఓ ఎడిటోరియల్కు రాసిన వ్యాసంలో తెలిపారు. ఆపిల్ సంస్థలో అత్యంత ముఖ్యమైన కార్యవర్గంలో చీఫ్గా పనిచేస్తున్న టిమ్ కుక్ తాను స్వలింగ సంపర్కుడినని స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. వాషింగ్టన్ పోస్ట్కు ఆయన ఒక వ్యాసం రాస్తూ గేల హక్కులను ప్రస్తావించారు.
మతపరమైన స్వేచ్ఛ పేరుతో పలు దేశాలు స్వలింగ సంపర్కులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని, వారికి ప్రతికూల చట్టాలు చేస్తున్నాయని, దీనివల్ల అత్యంత ముఖ్యమైన సమానత్వం సాధ్యం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ నిర్మాణం సమయంలో ఎలాంటి నిబంధనలు పెట్టుకున్నారో వాటన్నింటిని తుంగలో తొక్కుతున్నారని, ఇండియానా వంటి దేశాల్లో స్వలింగ సంపర్కులతో ఆర్థిక లావాదేవీలు కొనసాగించబోమని చెప్పడం.. పాశ్చాత్య దేశాలు ఎంతటి అపాయకరమైన స్థితిని ఆహ్వానిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. ఇలాంటి చర్యలు అమెరికాలోని పలు దేశాల్లో జరగడం చాలా దురదృష్టకరం అని వాపోయారు.