నేపాల్‌లో కొనసాగుతున్న ప్రతిష్టంభన | Nepal PM K P Sharma Oli and Prachanda on power-sharing fail | Sakshi
Sakshi News home page

నేపాల్‌లో కొనసాగుతున్న ప్రతిష్టంభన

Jul 6 2020 4:25 AM | Updated on Jul 6 2020 4:49 AM

Nepal PM K P Sharma Oli and Prachanda on power-sharing fail - Sakshi

కఠ్మాండు: అధికారాన్ని పంచుకునే విషయంలో రాజీ కుదరకపోవడంతో నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలి, అధికార నేపాల్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ ప్రచండల మధ్య చర్చలు ఆదివారం అసంపూర్తిగా ముగిశాయి. మళ్లీ సోమవారం చర్చలు కొనసాగించాలని రెండు వర్గాలు నిర్ణయించాయి. కీలక పార్టీ స్టాండంగ్‌ కమిటీ సమావేశానికి ముందే ఒక ఒప్పందానికి రావాలని వారు భావిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడిగా, ప్రధానిగా కేపీ శర్మ ఓలి దిగిపోవాలని ప్రచండ వర్గం కోరుతోంది. ప్రచండకు సీనియర్‌ నేతలు  మద్దతిస్తున్నారు. మరోవైపు, విపక్ష నేపాలీ కాంగ్రెస్‌ నేత, మాజీ ప్రధాని షేర్‌ బహదూర్‌ దేవ్‌బాతో ప్రధాని ఓలి భేటీ అయ్యారు. తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు విపక్ష మద్దతును కోరేందుకే ఓలి ప్రయత్నిస్తున్నారని భావిస్తున్నారు. ఓలి ప్రధానిగా కొనసాగేందుకు అవసరమైతే.. అధికార పార్టీని చీల్చే అవకాశాలు కూడా ఉన్నాయని కథనాలు వెలువడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement