నాసా గుప్పిట్లో ఆ గ్రహం గుట్టు..! | NASAs Planet Hunter Finds First Earth Size Habitable World | Sakshi
Sakshi News home page

నాసా గుప్పిట్లో ఆ గ్రహం గుట్టు..!

Jan 8 2020 6:52 PM | Updated on Jan 8 2020 8:57 PM

NASAs Planet Hunter Finds First Earth Size Habitable World - Sakshi

భూమి పరిమాణంలో కలిగిన గ్రహాన్ని నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు.

వాషింగ్టన్‌ : అంతరిక్షంలో భూమిని పోలిన నివాసయోగ్యత కలిగిన గ్రహానికి అన్వేషణ సాగించే పరిశోధనలకు ఊతమిచ్చేలా శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. మొదటిసారిగా భూమిని పోలిన పరిమాణం కలిగిన గ్రహాన్ని కనుగొన్నారు. ఈ ప్లానెట్‌లో ద్రవ నీరు ఉనికిని గుర్తించారు. మరొక సానుకూల అంశంగా ఈ గ్రహం మన సౌర వ్యవస్థకు సమీపాన ఉండటం వెలుగులోకి వచ్చింది. నాసాకు చెందిన గ్రహాల అన్వేషణ విభాగం ఇటీవల జరిగిన అమెరికన్ ఆస్ట్రోనామికల్ సొసైటీ సమావేశం సందర్భంగా ఈ వివిరాలు వెల్లడించింది. ఈ గ్రహం మన నుండి 100 కాంతి సంవత్సరాల కన్నా ఎక్కువ దూరంలో లేని ఒక నక్షత్రం (టీఓఐ 700) చుట్టూ తిరుగుతున్నట్టు ప్రకటించింది.

ఈ నక్షత్రం చుట్టూ తిరిగే మూడు గ్రహాల్లో ఈ గ్రహం ఒకటిగా పరిశోధకులు తేల్చారు. అంతరిక్ష పరిశోధన సంస్థ స్పిట్జర్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ సాయంతో ఖగోళ శాస్త్రవేత్తలు ఈ గ్రహం సామర్ధ్యాన్నిఅంచనా వేశారు. టీఓఐ 700 అనే గ్రహం ఇతర రెండు గ్రహాలతో పోల్చితే దాని నక్షత్రాన్ని చాలా దూరం నుండి కక్ష్యలో తిరుగుతుంది. ఈ గ్రహంలో ఒక వైపు ఎప్పుడూ పగటి వెలుగు ఉంటుందని గుర్తించారు. గతంలో టీఓఐ 700 గ్రహం  వేడిగా ఉంటుందని భావించారు, వ్యోమగాములు ఈ మూడు గ్రహాలూ మానవులకు నివాస యోగ్యం కాదని భావిస్తున్నా, ఈ గ్రహం భూ మండలంతో సమానంగా ప్రవర్తిస్తుందో లేదో నిర్ణయించలేమని, ఏదో ఒక రోజు, మనకు  ఈ గ్రహం స్పెక్ర్టం లభించినప్పుడు దీని ఆంతర్యాన్ని పసిగట్టవచ్చని, వాటిని దగ్గరి అనుకరణ స్పెక్ట్రమ్‌తో సరిపోల్చవచ్చని నాసా గొడ్దార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్‌ పరిశోధకుడు గాబ్రియెల్ ఎంగెల్మన్ సుయిసా వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement