ప్రాణాలు కాపాడిన మొబైల్‌.. | Mobile Phone May Have Saved Woman's Life | Sakshi
Sakshi News home page

ప్రాణాలు కాపాడిన మొబైల్‌..

May 26 2017 9:12 AM | Updated on Sep 5 2017 12:03 PM

ప్రాణాలు కాపాడిన మొబైల్‌..

ప్రాణాలు కాపాడిన మొబైల్‌..

మాంచెస్టర్‌ దాడిలో ఓ మహిళ ప్రాణాలు..

లండన్‌: మాంచెస్టర్‌ బాంబు పేలుళ్ల సంఘటనలో ఓ మహిళ ప్రాణాలను ఆమె మొబైల్‌ రక్షించింది. ఫోటోలు తీయడంలో బిజీగా ఉన్న లీసా బ్రిడ్జెట్‌ అనే మహిళా బాంబు పేలుళ్లు సంభవించినపుడు ఒక నట్‌ ఆమె వైపు బలంగా దూసుకొచ్చింది. అది ఆమె ఫోన్‌కు తగలడంతో ప్రాణపాయం తప్పిందని తీవ్రంగా గాయపడ్డ లీసా మీడియాకు తెలిపింది. ఈ దాడిలో ఆ నట్‌ బలంగా ఆమెను తాకడంతో మధ్య వేలును కోల్పోయింది. 
 
ఆ నట్‌ ఫోన్‌కు తగలి ఆమె చెంపను తాకడంతో గాయాలతో బయటపడింది. నట్‌ మొబైల్‌కు తగలడంతో దాని వేగం తగ్గి లీసాకు ప్రాణపాయం తప్పిందని ఆమె భర్త స్టీవ్‌ తెలిపాడు. లీసా చీలిమండ, తొడలకు తీవ్ర గాయం కావడంతో సర్జరీ చేయనున్నారని  స్టీవ్‌ ఫేస్‌ బుక్‌లో పేర్కొన్నాడు.. ఈ బాంబు దాడిలో 22 మరణించగా 64 మంది గాయపడ్డారు. ఈ కేసుకు సంబంధించి 8 మందిని యూకే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement