ఆ సమయంలో ఇవి తింటే స్మార్ట్‌ కిడ్‌ మీ సొంతం

Maternal intake of egg yolks, nuts can boost baby brain - Sakshi

న్యూయార్క్‌:  మీరు తల్లి కాబోతున్నారా? చురుకైన, తెలివైన స్మార్ట్‌కిడ్‌ కావాలని కలలు కంటున్నారా? అయితే మీలాంటి వారికోసమే ఈ వార్త. బిడ్డ మెదడు ఎదుగుదల సక్రమంగా ఉండాలంటే గుడ్డులోని పచ్చసొన, నట్స్‌, క్యాబేజీ జాతికి చెందిన కూరగాయలు వంటి ఆహారాలు విరివిగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది పుట్టబోయే బిడ్డ మెదడుకు, జ్ఞాపక శక్తికి మంచి బూస్ట్‌ ఇస్తుందని  తాజా అధ్యయనం తేల్చింది. అంతేకాదు గర్భధారణ సమయంలో విటమిన్ బి కాంప్లెక్స్ సముదాయములోని కోలైన్‌  విరివిగా  తీసుకోవాలని చెబుతోంది.

గర్భం దాల్చిన మహిళలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది ఎపుడూ పెద్ద ప్రశ్నే. ఎంత  చదువుకున్న మహిళలైనా ఈ విషయంలో తర్జన భర్జన పడుతూనే ఉంటారు. అయితే  గర్భధారణలో చివరి మూడు నెలల్లో తీసుకునే ఆహారం చాలా ముఖ్యమని తాజా అధ్యయనం చెబుతోంది. ముఖ్యంగా కొవ్వు తీసేసిన ఎర్ర మాంసం, (లీన్‌ రెడ్‌ మీట్‌) చేపలు, గుడ్లు,  తృణధాన్యాలను ఎక్కువగా తీసుకుంటే శిశువు ఆరోగ్యంగా ఎదుగుతుందని ఈ అధ్యయనం తేల్చింది. రోజువారీ  ఈ ఆహార పదార్ధాల వినియోగంతో  బిడ్డల ఎదుగుదలలో వేగం, విజువల్ జ్ఞాపకశక్తి నాలుగు, ఏడు, 10 , 13 నెలల వయస్సులో మెరుగుపర్చిందని ఈ అధ్యయనం సూచించింది. 

గర్భధారణ సమయంలో  అధికంగా తీసుకోవాల్సిన కోలిన్  చాలామంది మహిళలు చాలా తక‍్కువ మోతాదులో తీసుకుంటున్నారనీ, రోజుకు సిఫార్సు చేయబడిన 450 మిల్లీగ్రాముల కన్నా తక్కువ వినియోగిస్తారు. కానీ, గర్భధారణ చివరి త్రైమాసికంలో ప్రతిరోజూ సిఫార్సు చేసిన కొలైన రిచ్ ఫుడ్స్ తినడం రెండుసార్లు కంటే  ఎక్కువ తీసుకోవాలని తద్వారా పాపాయి ఎదుగుదల బావుంటుందని అధ్యయనం చెబుతోంది. ఆప్టిమల్‌ కాగ్నిటివ్‌ ఎబిలిటీస్‌ (సంక్లిష్ట సామర్ధ్యాలు మెదడు-ఆధారిత నైపుణ్యాలు:సరళంనుంచి చాలా సంక్లిష్టమైన పని అయినా నేర్చుకోవడం, జ్ఞాపకం చేసుకోవడం, పరిష్కారం, శ్రద్ధ వహించడం లాంటివి) మెరుగుపడతాయని తెలిపింది.  

న్యూయార్క్‌లోని కార్నెల్ విశ్వవిద్యాలయం  ప్రొఫెసర్ , మేరీ కాడిల్‌ ఆధ్వర్యంలో ఈ స్డడీ జరిగింది.  తమ అధ్యయనంలో భాగంగా  రెండు గ్రూపుల గర్భిణీలను పరిశీలించినట్టు చెప్పారు. మొదటి గ్రూపునకు రోజు కోలిన్‌ 930 మి.గ్రా. ఇవ్వగా, రెండవ  గ్రూపునకు  రోజుకు 480మి.గ్రా ఇవ్వగా ఇద్దరిలోనూ  వేగమైన  ప్రయోజనాలు కలిగినప్పటికీ రెండవ గ్రూపు కంటే.. మొదటి గ్రూపులోని పిల్లలు మెదడు అభివృద్ధి గణనీయమైన  ఫలితాలు   కనిపించాయని స్టడీ  పేర్కొంది. ఎఫ్‌ఏఎస్‌ఈబీ అనే  జర్నల్‌ ఈ అధ్యయనం  ప్రచురితమైంది.
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top