3వేల లాటరీతో.. ఐలండ్ రిసార్ట్ గెలిచాడు! | Man wins entire island resort for USD 49 in raffle draw | Sakshi
Sakshi News home page

3వేల లాటరీతో.. ఐలండ్ రిసార్ట్ గెలిచాడు!

Jul 28 2016 3:29 PM | Updated on Sep 4 2017 6:46 AM

3వేల లాటరీతో.. ఐలండ్ రిసార్ట్ గెలిచాడు!

3వేల లాటరీతో.. ఐలండ్ రిసార్ట్ గెలిచాడు!

అదృష్టం అంటే అతడిదే. కేవలం 3వేల రూపాయలు పెట్టి ఓ లాటరీ టికెట్ కొంటే.. ఏకంగా ఓ ఐలండ్ రిసార్ట్ అతడికి బహుమతిగా వచ్చేసింది.

అదృష్టం అంటే అతడిదే. కేవలం 3వేల రూపాయలు పెట్టి ఓ లాటరీ టికెట్ కొంటే.. ఏకంగా ఓ ఐలండ్ రిసార్ట్ అతడికి బహుమతిగా వచ్చేసింది. అది కూడా అలాంటిది, ఇలాంటిది కాదు.. పగడాల దిబ్బలు, గుహలు, మంచి అడవులు.. ఇవన్నీ ఆ దీవిలో ఉన్నాయి. న్యూ సౌత్ వేల్స్ ప్రాంతానికి చెందిన జోషువా అనే ఆ వ్యక్తి ‘ద కోస్రే నాటిలస్ రిసార్ట్’ను గెలుచుకున్నారు. దాని యజమానులు ఆస్ట్రేలియన్ దంపతులు. వాళ్లకు మనవళ్లు, మనవరాళ్లు పుట్టడంతో.. ద్వీపం వదిలి ఆస్ట్రేలియా వెళ్లిపోదాం అనుకుని ద్వీపాన్ని లాటరీ పెట్టారు. దాదాపు రెండు దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ రిసార్టును ఎవరైనా బాగా ప్రకృతి ప్రేమికులకు ఇవ్వాలని వాల్లు అనుకున్నారు. ఏదో డబ్బులు పెట్టి కొనుక్కోవడం కాకుండా.. ఇక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించే వాళ్లయితే మేలని భావించారు.

దీనికి సంబంధించి కథనాన్ని ఓ వెబ్సైట్లో చూసిన జోషువా.. మూడు టికెట్లు కొన్నాడు. అనుకోకుండా అతడికి లాటరీ తగిలేసింది. దాంతో అతడి ఆనందానికి అంతూ పొంతూ లేదు. ఐలండ్ రిసార్టు యజమానులు డౌగ్, సాలీలకు తాను ఎంతో రుణపడి ఉంటానని చెప్పాడు. కాగా, ఈ ఐలండ్ రిసార్ట్ గెలుచుకోడానికి లాటరీ నిర్వహించగా.. మొత్తం 75,485 టికెట్లు అమ్ముడుపోయాయి.150 దేశాలకు చెందినవాళ్లు వీటిని కొన్నారు. ఒకో టికెట్ను రూ. 3వేల చొప్పున అమ్మారు. ఎక్కువ టికెట్లు కొంటే డిస్కౌంటు కూడా ఇచ్చారు. జోషువా కావాలనుకుంటే తనంతట తానే ఈ రిసార్టును నిర్వహించుకోవచ్చు.. లేదా మేనేజర్ను నియమించుకోవచ్చు. దీనిమీద ఎలాంటి అప్పులు లేవు. ఇప్పటికే లాభాల్లో ఉంది, తగినంతమంది సిబ్బంది కూడా ఇందులో ఉన్నారు. మరి ఇది బంపర్ ప్రైజ్ కాక మరేమవుతుంది!!

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement