విమానంలో వ్యక్తి అసభ్య ప్రవర్తన..

Man Indecent Behaviour In Plane - Sakshi

వాషింగ్టన్‌ : అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలోని ఓ వ్యక్తి తన అసభ్య ప్రవర్తనతో తోటి ప్రయాణికులను ఇబ్బందికి గురిచేశాడు. సీటెల్‌ నుంచి ఆంకొరేజ్‌ బయల్దేరిన విమానంలో  తండ్రితో పాటు ప్రయాణిస్తున్న యువకుడు విమానం ల్యాండ్‌ అవటానికి కొద్ది సేపటి ముందు.. నగ్నంగా పరిగెడుతూ వికృత చర్యకు పాల్పడ్డాడు. దీంతో అవాక్కైన విమాన సిబ్బంది అతడిని బాత్‌రూమ్‌లో బంధించారు. సోమవారం జరిగిన ఈ సంఘటన గురించి అలస్కా మాజీ సెనేటర్‌ ఎల్లిస్‌ గ్రిన్స్‌ ట్విటర్‌లో  పోస్ట్‌ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

‘విమానంలో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని ఎయిర్‌ మార్షల్‌తో పాటు మరో వ్యక్తి.. (బహుశా అతడి తండ్రి అనుకుంటా) కలిసి ఆ యువకుడిని బాత్‌రూమ్‌లో ఉంచి తాళం వేశారు. అతడి ప్రవర్తనకు ప్రయాణికులంతా భయాందోళనలకు గురయ్యారు. అతడు డ్రగ్స్‌ తీసుకుని ఉండటం వల్ల అలా ప్రవర్తించి ఉంటాడని మేమంతా భావించాం. కానీ మా ప్రయాణం ఎంతో అద్భుతంగా సాగిందంటూ’  ఎల్లిస్‌ గ్రిన్స్‌ వ్యంగంగా ట్వీట్‌ చేశారు.

అయితే ఈ సంఘటనపై స్పందించిన అలస్కా ఎయిర్‌లైన్స్‌ ప్రతినిధి మాట్లాడుతూ.. ఫ్లైట్‌ 107లో అసభ్య ప్రవర్తించిన వ్యక్తిని బంధించడం సరైందేనని, విమానం​ ల్యాండ్‌ అయిన తర్వాత అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించామని తెలిపారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top