పడవ ప్రమాదంలో 8 మంది మృతి | Malaysia recovers 8 bodies in boat accident, 20 missing | Sakshi
Sakshi News home page

పడవ ప్రమాదంలో 8 మంది మృతి

Jul 25 2016 10:25 AM | Updated on Apr 3 2019 5:32 PM

పడవ ప్రమాదంలో 8 మంది మృతి - Sakshi

పడవ ప్రమాదంలో 8 మంది మృతి

పడవ సముద్రంలో మునిగిపోయిన ఘటనలో 8 మంది మృతి చెందగా.. 20 మంది గల్లంతయ్యారు.

కౌలాలంపూర్: మలేషియాలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. శరణార్ధులతో ప్రయాణిస్తున్న ఓ బోట్ సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా మరో 20 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారికోసం మలేషియా తీరప్రాంత సహాయక బృందాలు సోమవారం ముమ్మరంగా గాలింపు చేపడుతున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో మొత్తం 62 మంది ఉన్నారు. 34 మందిని సహాయక బృందాలు రక్షించాయి.

ఇండొనేషియాకు చెందిన శరణార్థులు అక్రమంగా మలేషియాలోకి ప్రవేశిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. సరైన పత్రాలు లేకుండా ప్రాణాలతో బయటపడిన వారిని తిరిగి ఇండొనేషియాకు పంపనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో తనతో పాటే ఉన్న భార్యను కాపాడుకోలేకపోయానంటూ ఓ వ్యక్తి స్థానిక మీదియాతో మాట్లాడుతూ బోరున విలపించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement