కరోనా: భారత్‌ నుంచి 444 మంది స్వదేశాలకు

Lockdown 444 People Repatriated Says Australian High Commission - Sakshi

న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్‌తో భారత్‌లో చిక్కుకుపోయిన 444 మంది విదేశీయులు ఆయా దేశాలకు బయల్దేరి వెళ్లారు. సిమ‌న్ క్విన్ గ్రూప్ సౌజ‌న్యంతో ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో వారంతా ఆదివారం ఉదయం మెల్‌బోర్న్‌కు పయనమయ్యారు. వీరిలో 14 మంది న్యూజిలాండ్‌ దేశీయులు కాగా.. మిగతా వారు ఆస్ట్రేలియా పౌరులు. త‌మ పౌరుల‌ను స్వదేశానికి తీసుకెళ్లేందుకు సహకరించిన ప్రధాని మోదీకి, విమానయాన మంత్రిత్వ శాఖకు, విదేశాంగ మంత్రి జైశంకర్‌కు ధన్యవాదాలు చెప్తూ భారత్‌లోని ఆస్ట్రేలియా హైకమిషన్‌ ట్వీట్‌ చేసింది. దాంతో పాటు తమ పౌరులు బయలుదేరుతున్న 44 సెకండ్ల నిడివిగల వీడియోను పోస్టు చేసింది. కాగా, భారత్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8356కు చేరుకుంది. ఇందులో ఇప్పటివరకు 716ని డిశ్చార్జ్‌ కాగా.. 273 మంది చనిపోయారు. ప్రసుత్తం 7367 కరోనా బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top