'నువ్వు బయట ఉంటే అమ్మాయిలకు డేంజర్' | Katie Locke murder: Carl Langdell jailed for life | Sakshi
Sakshi News home page

'నువ్వు బయట ఉంటే అమ్మాయిలకు డేంజర్'

Jun 3 2016 5:06 PM | Updated on Sep 4 2017 1:35 AM

'నువ్వు బయట ఉంటే అమ్మాయిలకు డేంజర్'

'నువ్వు బయట ఉంటే అమ్మాయిలకు డేంజర్'

కలిసిన తొలిరోజే ప్రియురాలిని దారుణంగా చంపి ఆమె శవంతో ఫొటోలు దిగిన కార్ల్ లాంగ్డెల్ అనే ఓ వ్యక్తికి బ్రిటన్ కోర్టు జీవిత కారాగార శిక్ష విధించింది.

కలిసిన తొలిరోజే ప్రియురాలిని దారుణంగా చంపి ఆమె శవంతో ఫొటోలు దిగిన కార్ల్ లాంగ్డెల్ అనే ఓ వ్యక్తికి బ్రిటన్ కోర్టు జీవిత కారాగార శిక్ష విధించింది. అతడు బయట ఉంటే సమాజానికి అత్యంత డేంజర్ అని వ్యాఖ్యానించింది. అతడు మహిళ పాలిట ఓ భయంకరమైన ఛీడపురుగు అని నిర్ధారించుకున్నాడని తెలిపింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కాటీ లాక్ (23) అనే టీచర్కు ఓ ఆన్ లైన్ సంస్థ ద్వారా కార్ల్ లాండ్డెన్ అనే వ్యక్తికి పరిచయం అయ్యింది.

అలా పరిచయం అయిన రెండు వారాల్లో వారు చాలా దగ్గరయ్యారు. క్రిస్టమస్ సందర్భంగా గత ఏడాది హెర్ట్ ఫోర్డ్ షైర్ లోని తియోబాల్డ్ పార్క్ హోటల్లో కలుసుకునేందుకు వచ్చారు. ఆ రాత్రంతా హోటల్లో ఓ గది తీసుకొని శారీరకంగా గడపాలని అనుకున్నారు. అయితే, వాస్తవానికి తానొక న్యాయ సంస్థను నడుపుతున్నానని చెప్పిన లాంగ్డెల్ ఓ మానసిక రోగి. అంతకుముందు నుంచే చికిత్స పొందుతున్నాడు. అతడికి ట్రీట్ మెంట్ చేసిన వైద్యులు చిర్రెత్తిపోయి ఉన్నారు.


గత కొద్ది రోజులుగా ఇంట్లోనే ఉంటున్న లాంగ్డెల్ మాయమాటలు చెప్పి ఆ టీచర్ ను బుట్టలో వేసుకున్నాడు. పథకం ప్రకారమే హోటల్ కు తీసుకెళ్లాడు. కానీ, అతడి ప్రవర్తన ముందుగానే గమనించి అప్రమత్తమయ్యేలోగానే.. అతడు శారీరకంగా దాడి చేయడం మొదలుపెట్టాడు. లైంగిక వాంఛలు తీర్చుకొని గొంతునులిమి చంపేశాడు. అనంతరం ఆమె మృతదేహంతో కలిసి ఫొటోలు దిగాడు. తిరిగి ఏమీ తెలియనట్లుగా ఆమె మృతదేహాన్ని అక్కడే పొదల్లో పడేశాడు.

ఈ కేసును విచారించిన జడ్జీ కేసు పూర్వపరాలు చూసి అవాక్కయ్యారు. తీర్పు సందర్భంగా ఏం చెప్పారంటే 'నీలాంటి వారిని బయటకు వదిలితే మహిళలకు.. అమ్మాయిలకు చాలా సమస్యలు. నీకు నువ్వు ఈ సమాజానికి ఛీడపురుగుగా, విశృంఖల వ్యక్తిగా నిరూపించుకున్నావు. కాతీ విషయంలో ఇది రుజువైంది. ఇంత దుర్మార్గంగా ఎవరూ వ్యవహరించరు. నువ్వు జీవితాంతం జైలులో ఉండటమే సరైనది' అని వ్యాఖ్యానించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement