కరోనా నుంచి కాపాడే ‘టీ సెల్స్‌’ | Karolinska Research Says Public Immunity From Coronavirus High | Sakshi
Sakshi News home page

కరోనా నుంచి కాపాడే ‘టీ సెల్స్‌’

Jul 1 2020 6:34 PM | Updated on Jul 1 2020 6:39 PM

Karolinska Research Says Public Immunity From Coronavirus High - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్‌ గురించి స్వీడన్‌లోని కరోలిన్‌స్కా పరిశోధనా కేంద్రం ఓ కొత్త విషయాన్ని కనుగొన్నది. ఇప్పటి వరకు అంచనా వేసిన సంఖ్య కన్నా మానవుల్లో కరోనాను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి రెండింతల మందిలో ఉందని మానవుల్లోని టీ సెల్స్‌ను పరిశీలించడం ద్వారా పరిశోధనా కేంద్రం వైద్యులు తేల్చారు. టీ సెల్స్‌ అంటే మానవ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే తెల్లరక్తం కణాలు. కరోనా వైరస్‌ బారిన పడిన రోగుల్లో ఆరోగ్యంగా ఉన్న 30 శాతం మందిలోని టీ సెల్స్‌ రోగ నిరోధక శక్తి పెరిగిందని, కరోనాను కట్టడి చేసేందుకు ఎంత శక్తి కావాలనేది ఇంకా స్పష్టం కావడం లేదని వారు తెలిపారు. ఆ 30 శాతం మందిలో కరోనా రోగ లక్షణాలు కూడా కనిపించలేదని వారు చెప్పారు. కరోనా బారిన పడిన వారిలో పిల్లలు ఎక్కువగా కోలుకోవడానికి కారణం టీ–సెల్స్‌యేనని, పిల్లల్లో అవి క్రియాశీలకంగా ఉంటాయని వైద్యులు చెప్పారు. (చదవండి : ఊపిరి ఆడటం లేదంటూ 50 ఆస్ప‌త్రులు..)

కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడం కోసం యూరప్‌లో లాక్‌డౌన్‌ ప్రకటించని ఏకైక దేశం స్వీడన్‌. అయినప్పటికి గత వారం రోజుల్లో కరోనా బారిన పడి మరణించే వారి సంఖ్య పది శాతం తగ్గింది. స్వీడన్‌లో కరోనా బారిన పడిన వారి సంఖ్య 5,5,000లకు చేరుకోగా మృతుల సంఖ్య 43 వేలకు చేరుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement