అత్యంత భయానక ఘటనను ఎదుర్కొన్న అప్ఘనిస్థాన్‌లోని అమెరికా యూనివర్సిటీ ఎట్టకేలకు తెరుచుకుంది. దాదాపు ఏడు నెలల తర్వాత ఆ పాఠశాల తిరిగి పనిచేయడం ప్రారంభించింది.
కాబుల్: అత్యంత భయానక ఘటనను ఎదుర్కొన్న అప్ఘనిస్థాన్‌లోని అమెరికా యూనివర్సిటీ ఎట్టకేలకు తెరుచుకుంది. దాదాపు ఏడు నెలల తర్వాత ఆ పాఠశాల తిరిగి పనిచేయడం ప్రారంభించింది. గతంలో ఉన్న నమోదైన విద్యార్థులతోపాటు కొత్తగా 76మంది కొత్త వారు వర్సిటీలో చేరారు. అయితే, వీరితో కలిపి మొత్తం విద్యార్థులు ఎంతమంది అనే విషయం మాత్రం తెలియరాలేదు.
గత ఏడాది ఆగస్టు 24న దాదాపు 750మంది విద్యార్థులు, ప్రొఫెసర్లు, లెక్చరర్లు కాబుల్‌లోని ది అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ అఫ్ఘనిస్థాన్‌లో ఉండగా ఉగ్రవాదులు ఆత్మాహుతిదాడితో కాల్పులతో తెగబడ్డారు. ఈ ఘటనలో మొత్తం 17మంది మృత్యువాతపడ్డారు. ఆత్మాహుతి దాడికి పాల్పడిన వ్యక్తి ట్రక్కు నిండా బాంబులతో వచ్చి ఈ దారుణానికి ఒడిగట్టాడు. దీంతో భారీ ప్రాణనష్టం చోటుచేసుకుంది. ఆ కారణంగా మూతపడిన యూనివర్సిటీ తిరిగి ఏడు నెలల తర్వాత తెరుచుకుంది.