రిపబ్లికన్ రేసు నుంచి బుష్‌ ఔట్‌! | Jeb Bush ends his 2016 presidential campaign | Sakshi
Sakshi News home page

రిపబ్లికన్ రేసు నుంచి బుష్‌ ఔట్‌!

Feb 21 2016 10:48 AM | Updated on Apr 4 2019 5:04 PM

రిపబ్లికన్ రేసు నుంచి బుష్‌ ఔట్‌! - Sakshi

రిపబ్లికన్ రేసు నుంచి బుష్‌ ఔట్‌!

అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం రిపబ్లికన్ నేత జేబ్ బుష్ జరిపిన పోరాటం ముగిసింది.

కొలంబియా: అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం రిపబ్లికన్ నేత జేబ్ బుష్ జరిపిన పోరాటం ముగిసింది. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం జరిగిన సౌత్ కరోలినా ప్రైమరీలో ఘోరంగా ఓటమి పాలుకావడంతో ఆయన ఈ రేసు నుంచి తప్పుకున్నారు. ఇంతకుముందు లోవా, న్యూ హ్యాంప్‌షైర్‌ ప్రైమరీల్లోనూ ఆయన పరాజయమే ఎదురైంది.

అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ హెచ్‌బీ బుష్ కొడుకు, మరో మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ సోదరుడైన జేబ్ బుష్ రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి రేసులో ఫేవరేట్ గా బరిలోకి దిగినప్పటికీ ఓటర్లను ఆకట్టుకోలేకపోయారు. ప్రస్తుతం రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి రేసులో ముందంజలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ సౌత్ కరోలినాలోనూ విజయం సాధించి.. అధ్యక్ష ఎన్నికల బరిలో  నిలిచేదిశగా సాగుతున్నారు. అయితే, ట్రంప్‌కు విధానాలు కానీ, దార్శనికతకానీ లేదని జేబ్ బుష్ మండిపడ్డారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement