ఒళ్లు గగుర్పొడిచేలా.. గాల్లో తలకిందులుగా...

Japan Rollercoaster Gets Stuck  Riders Left Hanging Upside Down - Sakshi

సాహసం చెయ్యరా డింభకా అంటూ ఓ 60 మంది రోలర్‌ కోస్టర్‌ ఎక్కారు.. గిరాగిరా తిరిగిన రోలర్‌ కోస్టర్‌.. సరిగ్గా అందులోని వారు తలకిందులుగా ఉన్న సమయంలో ఆగిపోయింది. అప్పటివరకు గాలిలో గింగిరాలు కొడుతూ.. కేరింతలు కొట్టిన సందర్శకులు.. అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామంతో షాక్‌ తిన్నారు. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని రెండు గంటల పాటు బిక్కుబిక్కుమంటూ గాల్లో తలకిందులుగా గడిపారు. చివరకు రక్షక దళాలు రంగంలోకి దిగడంతో బతుకు జీవుడా అంటూ ఆ రోలార్‌ కోస్టర్‌ నుంచి బయటపడ్డారు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటనకు సంబంధించిన వీడియోను జపనీస్‌ మీడియా యూట్యూబ్‌లో పోస్ట్‌ చేసింది.

జపాన్‌లోని యూనివర్సల్‌ స్టూడియోలో ఉన్న ‘ఫ్లైయింగ్‌ డైనోసార్‌’ రోలర్‌ కోస్టర్‌ ఎక్కేందుకు రోజుకు వందల మంది వస్తూ ఉంటారు. అలాగే మంగళవారం కూడా ఓ 60 మంది వచ్చారు. వారంతా ఎంతో ఉత్సాహంతో రైడ్‌ ప్రారంభించారు. కానీ కాసేపటి తర్వాత సాంకేతిక లోపం తలెత్తడంతో.. రోలర్‌కోస్టర్‌ మధ్యలోనే ఆగిపోయింది. దీంతో రెండు గంటల పాటు వారంతా గాల్లోనే ఉండాల్సి వచ్చింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని స్థానిక మీడియా పేర్కొంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top