ఐఎస్ఐఎస్ నెం 2 హతం! | ISIS's No. 2 man killed in Iraq airstrike: Report | Sakshi
Sakshi News home page

ఐఎస్ఐఎస్ నెం 2 హతం!

May 13 2015 8:22 PM | Updated on Sep 3 2017 1:58 AM

ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థకు మరో ఎదురుదెబ్బ తగిలింది.

బాగ్దాద్: ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థకు మరో ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా దాడుల్లో ఐఎస్ఐఎస్ చీఫ్ అబూ బకర్ అలీ బాగ్దాదీ చనిపోయినట్టు వార్తలు రాగా.. తాజాగా రెండోస్థానంలో అబూ అలా అఫ్రీని హతమార్చినట్టు భావిస్తున్నారు. బుధవారం అమెరికా సారథ్యంలో ఇరాక్ ఉత్తర ప్రాంతంలో జరిపిన వైమానిక దాడుల్లో అఫ్రీ మరణించి ఉంటాడని ఇరాక్ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. టల్ ఆఫర్ పట్టణంలో ఓ మసీదులో అఫ్రీ తన అనుచరులతో సమావేశమైన సమయంలో వైమానిక దాడుల చేశారు.

Advertisement

పోల్

Advertisement