పంటిగాటు చికిత్స!

Innovative medicine - Sakshi

చికిత్సలందు ఈ చికిత్స వేరయా అనాల్సిందే ఎవరైనా.. ఎందుకంటే ఆమె వైద్యం ఓ ఆశ్చర్యం. రక్త ప్రసరణ సరిగ్గా జరిగేందుకు ఆమె వినూత్నమైన వైద్యాన్ని కనుగొన్నారు. ఆ వైద్యం గురించి తెలిస్తే మీరు నోరెళ్లబెట్టాల్సిందే. ఇంతకీ ఆమె ఏం చేస్తుందో తెలుసా.. తన పళ్లతో వీపు భాగంలో కొరుకుతుంది. ఆ వింత డాక్టర్‌ పేరు డొరోతీ స్టీన్‌. అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన స్టీన్‌.. చిన్నప్పుడు తన తల్లికి మసాజ్‌ చేసేందుకు చేతులు బలంగా లేకపోవడంతో తన పళ్లతో కొరకమని చెప్పిందట. దీంతో స్టీన్‌ తల్లికి ఉపశమనం అనిపించేదట.

నాలుగు దశాబ్దాల తర్వాత కూడా స్టీన్‌ ఆ విద్యను అలాగే కొనసాగిస్తున్నారు. ఓ రకంగా ఈ మసాజ్‌ వల్ల న్యూజెర్సీలో టాప్‌ సెలబ్రిటీ అయిపోయారు. ఆమె క్లినిక్‌కు వచ్చే వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోయిందట. తొలుత ఉచితంగానే ఈ మసాజ్‌ను చేసేవారట. కానీ ఇప్పుడు ఒకసెషన్‌కు ఫీజు కింద దాదాపు రూ.10 వేలు తీసుకుంటున్నారట. చాలా కాస్ట్‌లీనే.   

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top