అక్కడ కాఫీ తాగాలంటే లక్షలు పెట్టాల్సిందే.. | Inflation Rate At Its Peak In Venezula | Sakshi
Sakshi News home page

అక్కడ కాఫీ తాగాలంటే లక్షలు పెట్టాల్సిందే..

Jan 28 2019 11:39 AM | Updated on Jan 28 2019 11:39 AM

Inflation Rate At Its Peak In Venezula - Sakshi

వెనిజులా : పట్టపగ్గాల్లేకుండా పెరిగిన ద్రవ్యోల్బణంతో వెనిజులాలో ఏ చిన్న వస్తువు కొనాలన్నా స్ధానిక కరెన్సీలో లక్షలు వెచ్చించాల్సిన పరిస్థితి. కప్పు కాఫీ ధర అక్కడి కరెన్సీలో పది లక్షల వెనిజులా బొలివర్స్‌ కావడం గమనార్హం. డాలర్‌తో బొలివర్స్‌ మారకం విలువ 637కు చేరడంతో ప్రజలు విలవిలలాడిపోతున్నారు. వెనిజులాలో ఈ ఏడాది ద్రవ్యోల్బణం పదిలక్షల శాతానికి చేరుకుంటుందని ఐఎంఎఫ్‌ అంచనా వేయడంతో జనం బెంబేలెత్తుతున్నారు. నిత్యావసరాల ధరలు ప్రతి 19 రోజులకు రెట్టింపవుతున్నాయి.

పెరుగుతున్న ధరలకు కళ్లెం వేసేందుకు వెనిజులా ప్రభుత్వం బ్యాంకు నోట్లను ఇబ్బడిముబ్బడిగా ముద్రిస్తుండటంతో పరిస్థితి మరింత దిగజారుతోంది. గత కొన్నేళ్లుగా వెనిజులాలో నెలకొన్న రాజకీయ సంక్షోభం దేశాన్ని ఆర్థిక సుడిగుండంలోకి నెట్టేసింది. జీవన స్ధితిగతులు దిగజారిపోవడంతో అధ్యక్షుడు నికోలస్‌ మదురోకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. దేశప్రజలే కాదు విదేశాలు సైతం ఆయన విధానాలను తీవ్రంగా ఎండగడుతున్నాయి. సంపన్న చమురు దేశాన్ని సామాజికార్థిక, రాజకీయ రంగాల్లో నిర్వీర్యం చేసిన అధ్యక్షుడి తీరును తప్పుపడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement