హెచ్‌–1బీపై నిర్ణయం తీసుకోండి

Indians On H-1B Visas Aren't Illegal Economic Immigrants: Arun Jaitley - Sakshi

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ

వాషింగ్టన్‌: హెచ్‌–1బీ వీసాలపై భారత్‌ నుంచి అమెరికాకు వస్తున్న ఐటీ నిపుణులు అక్రమ ఆర్థిక వలసదారులేమీ కాదనీ, వీసా విధానంపై నిర్ణయం తీసుకునే సమయంలో అమెరికా సరైన విధంగా వ్యవహరించాలని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు. భారత ఐటీ నిపుణులను అమెరికా ప్రత్యేకంగా చూడాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ప్రపంచ బ్యాంకుల వార్షిక సమావేశం కోసం వాషింగ్టన్‌ వెళ్లిన జైట్లీ...అక్కడ మాట్లాడుతూ ‘భారత్‌ నుంచి హెచ్‌–1బీపై అమెరికాకు వస్తున్నవారంతా నిపుణులే.

అమెరికా ఆర్థిక వ్యవస్థకు వారెంతో మేలు చేస్తున్నారు. వారు అక్రమ ఆర్థిక వలసదారులు కాదు. చట్టబద్ధంగానే ఇక్కడకు వచ్చారు’ అని వివరించారు. అమెరికా మంత్రులతో  భేటీలో హెచ్‌–1బీని ప్రస్తావించినట్లు చెప్పారు. భారత ఐటీ కంపెనీలకు దాదాపు 60 శాతం ఆదాయం అమెరికా నుంచే వస్తోంది. ఆ సంస్థలు  భారత్‌ నుంచి ఉద్యోగులను హెచ్‌–1బీపై అమెరికాకు పంపుతుంటాయి.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top