యునెస్కోలో భరత నాట్య ప్రదర్శన

Indian Bharatanatyam exponent to make history at UNESCO in Paris - Sakshi

లండన్‌: ప్రముఖ భరతనాట్య కళాకారిణి, పరిశోధకురాలు బాలాదేవీ చంద్రశేఖర్‌ తన ప్రదర్శన ద్వారా చరిత్ర సృష్టించనున్నారు. గురువారం ఆమె పారిస్‌లోని యునెస్కో(ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్ర, సాంస్కృతిక మండలి)లో వివిధ దేశాలకు చెందిన 100 మంది సమక్షంలో ‘బృహదీశ్వర’ అంశంపై భరతనాట్య ప్రదర్శన ఇవ్వనున్నారు.

‘ఇది చాలా అరుదైన ప్రదర్శన. భారతీయ ప్రాచీన కట్టడాలపై ఆసక్తి కలిగించేందుకు, మన దేశం, సంస్కృతులపై అవగాహన పెంచేందుకు ఈ ప్రదర్శన ఉపయోగపడుతుంది’ అని బాలాదేవి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ప్రాంతాల్లో కూడా ‘బృహదీశ్వర’ ప్రదర్శన ఇవ్వనున్నట్లు వివరించారు. తమిళనాడులోని తంజావూరులో ఉన్న బృహదీశ్వరాలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించింది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top