14న ఇమ్రాన్‌ ప్రమాణ స్వీకారం!

Imran Khan may take oath as Pakistan PM on August 14 - Sakshi

ఇస్లామాబాద్‌: పాక్‌ స్వాతంత్య్ర దినోత్సవం రోజైన ఆగస్ట్‌ 14న ఇమ్రాన్‌ ఖాన్‌ దేశ ప్రధానిగా ప్రమాణం చేసే వీలుందని పాక్‌ మీడియా తెలిపింది. గతంలో తాను ఆగస్టు 11నే పాక్‌ ప్రధానిగా ప్రమాణం చేస్తానని ఇమ్రాన్‌ ప్రకటించారు. జూలై 25న జరిగిన పోలింగ్‌లో ఇమ్రాన్‌ ఖాన్‌కు చెందిన పాకిస్తాన తెహ్రీక్‌ ఇ ఇన్సాఫ్‌ పార్టీ 116 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచిన సంగతి తెలిసిందే. కొత్త పాక్‌ ప్రధాని ఆగస్టు 14న ప్రమాణస్వీకారం చేయాలన్నది తన, ఆపద్ధర్మప్రధాని నసీరుల్‌ ముల్క్‌ ఉద్దేశమని తాత్కాలిక న్యాయమంత్రి అలీజాఫర్‌ చెప్పారు. జాతీయ అసెంబ్లీ ఆగస్టు 12న ప్రారంభవుతుందనీ, ఇమ్రాన్‌ ప్రధానిగా 14న ప్రమాణం చేస్తారని వెల్లడించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top