ప్లాస్టిక్‌ సర్జరీ ఎంత పని చేసింది.. | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్‌ సర్జరీ ఎంత పని చేసింది..

Published Sun, Oct 15 2017 2:06 AM

How plastic surgery did work

ఇటీవల దక్షిణ కొరియా విమానాశ్రయంలో ముగ్గురు చైనీయులను ఎయిర్‌పోర్టు అధికారులు అడ్డుకున్నారు. వాళ్లేదో దొంగతనం, స్మగ్లింగ్‌ వంటి నేరాలకు ఏమీ పాల్పడలేదు.. కేవలం ట్రీట్‌మెంట్‌ కోసం దక్షిణ కొరియాకు వచ్చిన పేషెంట్లు.. మరి వారిని ఎందుకిలా అడ్డుకున్నారంటే వారి పాస్‌పోర్టులోని ఫొటోలతో వారి ముఖాలు మ్యాచ్‌ అవ్వలేదు. చైనా నుంచి దక్షిణ కొరియాకు మ్యాచ్‌ అయిన ఫొటోలు తిరిగి తమ దేశానికి వెళ్లేటప్పుడు మ్యాచ్‌ కాకపోవడం ఏంటి? ఏమీలేదు వారు దక్షిణ కొరియాకు వచ్చింది ప్లాస్టిక్‌ సర్జరీ ట్రీట్‌మెంట్‌ కోసం.. అందుకే విమానాశ్రయంలో వారి ఫొటోలతో ప్రస్తుత ముఖాలు సరిపోలక అధికారులు వారిని నిలిపేశారు. ప్రపంచంలో ప్లాస్టిక్‌ సర్జరీ ఆపరేషన్లకు దక్షిణ కొరియా పెట్టింది పేరు. చైనా, జపాన్, ఇతర ఆసియా దేశాల వారు తరచూ దక్షిణ కొరియాకు ట్రీట్‌మెంట్‌ నిమిత్తం వెళుతుంటారు.

సాధారణంగా ఇలా విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులకు ప్లాస్టిక్‌ సర్జరీ చేసిన అనంతరం సర్జరీలో మార్పులకు గురయిన, మార్పులకు నోచుకోని శరీర భాగాల పేర్లు తెలుపుతూ ఆస్పత్రులు ఒక సర్టిఫికెట్‌ను వారికి అందజేస్తారు. ఆ సర్టిఫికెట్‌ను వారు విమానాశ్రయంలో అధికారులకు చూపించాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికెట్‌ ఆధారంగా అధికారులు ప్రయాణికులను వారి దేశాలకు అనుమతిస్తారు. అయితే ఇక్కడ ఈ ముగ్గురి చైనీయుల విషయంలో అది జరగలేదు.. ఎందుకంటే వారు తమ ముఖాలను పూర్తిగా మార్చుకున్నారు.

అందులోనూ ముఖాలకు కట్లతో రావడం వల్ల అధికారులు పాస్‌పోర్టులోని ఫొటోలతో వారిని సరిపోల్చలేకపోయారు. దీంతో వారి శరీరాల ఆధారంగా వారిని గుర్తించి చైనా వెళ్లేందుకు అనుమతించారు. అయినా ఇది కూడా వెంటనే జరగలేదండోయ్‌.. వారిని గుర్తించడానికి అధికారులు కొద్ది రోజులు సమయం 
తీసుకున్నారు..      

Advertisement

తప్పక చదవండి

Advertisement