‘అకడమిక్ ర్యాంకింగ్స్ ఆఫ్ వరల్డ్ యూనివర్సిటీస్’లో అమెరికా వర్సిటీల హవా కొనసాగింది.
షాంఘై: షాంఘై ర్యాంకింగ్ కన్సల్టెన్సీ విడుదలచేసిన ‘అకడమిక్ ర్యాంకింగ్స్ ఆఫ్ వరల్డ్ యూనివర్సిటీస్’లో అమెరికా వర్సిటీల హవా కొనసాగింది. ఈ ర్యాంకింగ్స్‌లో అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఒకటో ర్యాంకు సాధించింది. స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ రెండో ర్యాంకు, మసాచుసెట్స్ టెక్నాలజీ వర్సిటీ మూడో ర్యాంకు, కాలిఫోర్నియా వర్సిటీ నాల్గో ర్యాంకు సాధించాయి. ప్రిన్స్‌టన్, ఆక్స్‌ఫర్డ్, కొలంబియా, కాలిఫోర్నియా టెక్నాలజీ ఇనిస్టిట్యూట్, షికాగో వర్సిటీలు తొలి 10 జాబితాలో స్థానం పొందాయి.
చైనాలోని ప్రతిష్టాత్మకమైన సింగువా వర్సిటీ తొలిసారిగా టాప్50లో చోటు దక్కించుకుంది. ఆసియా నుంచి మెరుగైన ర్యాంకు పొందిన వాటిలో టోక్యో యూనివర్సిటీ(24) ఉంది. యూరప్ నుంచి స్విస్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్ ఉత్తమ ర్యాంకు పొందింది. 2003 నుంచి షాంఘై సంస్థ ప్రపంచంలోని అత్యుత్తమమైన తొలి 500 విద్యాసంస్థలకు ర్యాంకులు ప్రకటిస్తోంది.