వంతెన.. వణికించేలా.. | Gokteik bridge is very dangerous | Sakshi
Sakshi News home page

వంతెన.. వణికించేలా..

Oct 3 2014 2:28 AM | Updated on Sep 2 2017 2:17 PM

వంతెన.. వణికించేలా..

వంతెన.. వణికించేలా..

ఈ వంతెన మీద నుంచి రైలులో వెళ్తున్నప్పుడు మన రోమాలు నిక్కబొడవాల్సిందే.. రైలు పడిపోతుందేమో అన్నట్లుగా ఉంటుంది. ఇలాంటి అనుభూతి మీకు సొంతం కావాలంటే..

ఈ వంతెన మీద నుంచి రైలులో వెళ్తున్నప్పుడు మన రోమాలు నిక్కబొడవాల్సిందే.. రైలు పడిపోతుందేమో అన్నట్లుగా ఉంటుంది. ఇలాంటి అనుభూతి మీకు సొంతం కావాలంటే.. ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. మన పక్కనే ఉన్న మయన్మార్‌లోనే ఉందీ గోతైక్ వంతెన. 2,260 అడుగుల పొడవున ఉండే ఈ వంతెన.. 820 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ భారీ వంతెనకు సపోర్టుగా కిందన 15 భారీ టవర్లు ఉంటాయి. దీన్ని ఆంగ్లేయుల జమానాలో కట్టారు. 1900లో నిర్మాణం పూర్తయింది. ఈ వంతెన వద్దకొచ్చేసరికి రైలును కూడా ఆటోమేటిక్‌గా స్లో చేసేస్తారు. దీన్ని దాటడానికి కనీసం 25 నిమిషాల సమయం తీసుకుంటుంది. అంతసేపూ.. మన గుండె లబ్‌డబ్.. లబ్‌డబ్బే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement