లీటరుకు 1,491 కిలోమీటర్లు..

German Prosecutors have Recorded calls between VW bigwigs Talking dieselgate - Sakshi

లీటరు డీజిల్‌కు కారు ఎంత మైలేజీ ఇస్తుంది.. మహా అయితే ఓ 30 కిలో మీటర్ల వరకు ఇస్తుంది. కానీ ఈ ఫొటోలో ఉన్న కారు ఎంత ఇస్తుందో తెలుసా..? లీటరు డీజిల్‌కు ఏకంగా 1,491 కిలోమీటర్లు! ఇది రికార్డు స్థాయి అనే చెప్పుకోవచ్చు. దీన్ని నమ్మక తప్పదు.. ఇంతకీ ఈ కారు విశేషాలేంటో తెలుసా..? షెల్‌ మారథాన్‌ అనే ఈ కారును ఫోక్స్‌వ్యాగన్‌ కంపెనీ 1982లో తయారు చేసింది. గంటకు గరిష్టంగా 30 కిలోమీటర్ల వేగంతో మాత్రమే వెళ్తుంది. ఈ కారును ఇటీవల జర్మనీలోని ఎస్సెన్‌లో జరిగిన క్లాసిక్, ప్రెస్టిజ్‌ ఆటోమొబైల్స్‌ టెక్నో క్లాసికా అనే కార్ల ప్రదర్శనలో దీన్ని ప్రదర్శించారు. అక్కడికి వచ్చిన వారందరినీ ఈ కారు ఎంతగానో ఆకట్టుకుంది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top