అచ్చం టోపీలాగ ఉంది గురూ! | Georgy Kot's top HAT hairstyle becomes an Instagram sensation | Sakshi
Sakshi News home page

అచ్చం టోపీలాగ ఉంది గురూ!

Jan 6 2016 5:59 PM | Updated on Sep 3 2017 3:12 PM

అచ్చం టోపీలాగ ఉంది గురూ!

అచ్చం టోపీలాగ ఉంది గురూ!

ఇదేమి స్టైల్ బాబు, అచ్చం టోపీ లాగ ఉంది చూడు!....పొడవాటి కురులున్న ముద్దు గుమ్మలను ఎంపిక చేసుకొని విభిన్న రీతుల్లో వారి కురులను మెలితిప్పి కొత్త కొత్త ఫ్యాషన్లను సృష్టించడంలో ఆరితేరిన రష్యన్ హెయిర్ స్టైలిస్ట్ జార్జి కాట్ సరికొత్త స్టైల్ ఇది.

మాస్కో: ఇదేమి స్టైల్ బాబు, అచ్చం టోపీ లాగ ఉంది చూడు!....పొడవాటి కురులున్న ముద్దు గుమ్మలను ఎంపిక చేసుకొని విభిన్న రీతుల్లో వారి కురులను మెలితిప్పి కొత్త కొత్త ఫ్యాషన్లను సృష్టించడంలో ఆరితేరిన రష్యన్ హెయిర్ స్టైలిస్ట్ జార్జి కాట్ సరికొత్త స్టైల్ ఇది. ఈ స్టైల్‌ను తీర్చిదిద్దిన తీరు గురించి తెలియజేసే ఆన్‌లైన్ వీడియో ఇప్పుడు ‘ఇన్‌స్టాగ్రామ్’లో హల్‌చల్ చేస్తోంది. ఇప్పటికే దీన్ని 70 వేల మంది వీక్షించగా, దాదాపు పదివేల మంది కామెంట్లు చేశారు.

జార్జికాట్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 6,23,000 మంది అభిమానులు ఉన్నారు. ఎప్పుడూ భిన్న రీతుల్లో హెయిర్ స్టైల్‌ను రూపొందించేందుకే తాన ప్రాధాన్యతనిస్తానని, ఒక్కోసారి తన స్టైల్‌ను చూసే తాను అబ్బుర పడతానని, కొన్ని సార్లు తాను చేసినదే తనకు నమ్మబుద్ధి కాదని ఆయన వ్యాఖ్యానించారు. అచ్చంగా శిలా విగ్రహాలకు కురులు దిద్దినట్టుగా ఆయన తీర్చిదిద్దే హెయిర్ స్టైల్ ఉంటుందని అభిమానులు ఆయన్ని ప్రశంసిస్తుంటారు.

ఇప్పుడు ఈ సరికొత్త స్టైల్‌కు సంబంధించిన 30 సెకండ్ల వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో చూసిన అభిమానులు ప్రశంసలతో ఆయన్ని ముంచెత్తుతున్నారు. ఇదేమి స్టైల్ బాబు!  అని కొందరు సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేస్తుంటే మరికొందరు అద్భుతం, అత్యద్భుతమని, ఇంకొందరు ‘హెయిర్ టోపీకి కొత్త నిర్వచనం’ అంటూ వ్యాఖ్యానించారు. ఇలా హెయిర్ స్టైల్‌ను టోపీలాగా తీర్చి దిద్దడానికి టోపీ డోమ్‌లాంటి రింగ్‌ను, కొన్ని వలయాకారపు రింగులతోపాటు హేర్ పిన్స్‌ను జార్జ్ కాట్ ఉపయోగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement