పాప్‌ గాయకుడు జార్జ్‌ మైకేల్‌ కన్నుమూత | George Michael: Pop superstar dies at 53 | Sakshi
Sakshi News home page

పాప్‌ గాయకుడు జార్జ్‌ మైకేల్‌ కన్నుమూత

Dec 27 2016 2:34 AM | Updated on Jul 31 2018 5:31 PM

పాప్‌ గాయకుడు జార్జ్‌ మైకేల్‌ కన్నుమూత - Sakshi

పాప్‌ గాయకుడు జార్జ్‌ మైకేల్‌ కన్నుమూత

ప్రముఖ పాప్‌ గాయకుడు జార్జ్‌ మైకేల్‌ (53) ఆదివారం బ్రిటన్‌లోని తన నివాసంలో కన్నుమూశారు.

లండన్‌: ప్రముఖ పాప్‌ గాయకుడు జార్జ్‌ మైకేల్‌ (53) ఆదివారం బ్రిటన్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. నిద్రపోతున్న సమయంలో గుండెపోటు వచ్చి ఆయన మరణించారని జార్జ్‌ మేనేజర్‌ తెలిపారు. 1980ల్లో జార్జ్‌ పాటలు బాగా ప్రాచుర్యం పొందాయి. జార్జ్‌ చనిపోవడం వివరించలేనిదే కానీ అనుమానాస్పదం కాదని థేమ్స్‌ వ్యాలీ పోలీసులు చెప్పారు.  శవ పరీక్ష పూర్తైన తర్వాత మిగతా వివరాలిస్తామన్నారు. 1963లో లండన్‌లో జన్మించిన మైకేల్‌ ‘వామ్‌!’పాప్‌ గ్రూప్‌తో ప్రయాణం ఆరంభించారు. తర్వాత దాన్నుంచి విడిపోయి సొంతంగా ఆల్బమ్‌లు రూపొందించారు. ఆయన నాలుగు దశాబ్దాల కెరీర్లో 10 కోట్లకు పైగా ఆల్బమ్స్‌ అమ్ముడయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement