George Michael
-
అక్కడ బాగ్దాద్.. ఇక్కడ ఓరుగల్లు!
► ఒకే తరహా నగరాలన్న లండన్ నిపుణుడు జార్జ్ మైఖేల్ ► ఓరుగల్లు వృత్తాకార నగరం ఎంతో ప్రత్యేకం ► భారత్‌లో ఇలాంటి నిర్మాణశైలి మరెక్కడా కనిపించదు ► కాకతీయ కీర్తి తోరణాలు చూసే కుతుబ్‌షాహీలు చార్‌కమాన్ నిర్మించారని వెల్లడి ► ‘రీడిస్కవరింగ్ తెలంగాణ’ సదస్సులో నివేదిక సాక్షి, హైదరాబాద్: ‘‘వృత్తాకారంలో నగరం.. మూడంచెలుగా ప్రాకారాలు.. ఒక్కోదానికి నలువైపులా నాలుగు ద్వారాలు.. నేరుగా వెళ్లే అవకాశం లేకుండా మలుపులు తిరిగి ప్రవేశించేలా మార్గాలు.. మండల, స్వస్తిక్, యంత్ర పద్ధతులను అనుసరించి దుర్భేద్యంగా తీర్చిదిద్దిన తీరు.. భారతదేశం వెలుపల ఈ తరహా వృత్తాకార నగర నిర్మాణం మళ్లీ ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో మాత్రమే కనిపిస్తుంది. ఈ రెండు నగరాల నిర్మాణం ఒకదాని నమూనాపై మరోటి ఆధారపడి తీర్చిదిద్దారన్న భావన కలుగుతుంది..’’ అని లండన్‌కు చెందిన పురాతత్వ నిపుణుడు డాక్టర్ జార్జ్ మైఖేల్ వెల్లడించారు. అయితే దీనికి శాస్త్రీయ రుజువులు మాత్రం లేవని చెప్పారు. 1980 దశకంలో ఓరుగల్లు నగర నిర్మాణం, కాకతీయుల విశిష్టతపై జార్జ్ మైఖేల్ విస్తృత పరిశోధన జరిపారు. ఆ తర్వాత కూడా మరో రెండు సార్లు వచ్చి అధ్యయనం చేశారు. తాజాగా తెలంగాణ పురావస్తు శాఖ ‘రీడిస్క వరింగ్ తెలంగాణ’ పేరుతో ఏర్పాటు చేసిన రెండు రోజుల అంతర్జాతీయ సదస్సులో పాల్గొ న్న ఆయన తన నివేదికను సమర్పించారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడారు. దేవా లయాలకు తోరణాలు (ద్వారాలు) ఏర్పాటు చేసినట్టుగా.. ఓరుగల్లు చుట్టూ కీర్తి తోరణాలు ఏర్పాటు చేసిన ఆ రాజుల ఆలోచనను కీర్తించకుండా ఉండలేమన్నారు. పవిత్రంగా భావించే స్వస్తిక్ ఆకృతిలో నగరానికి నాలుగు వైపులా ఏర్పాటు చేసిన ద్వారాల నుంచి సవ్య దిశలో మాత్రమే వెళ్లేలా ఏర్పాట్లు, ఒక్కో ద్వారానికి ఒకటి ప్రతిబింబంలా ఏర్పాటు చేసిన తీరు గొప్ప నిర్మాణ కౌశలానికి నిదర్శనమని ప్రశంసించారు. గొప్ప నగరమిది.. భారతదేశంలోని నగరాల నిర్మాణంలో నాయక్‌లకు ప్రాధాన్యం ఉండేదని... నగరం, దాని చుట్టూ కోట గోడ, రక్షణగా బురుజులు, ఒక్కో బురుజుకు ఒక్కో నాయక్‌తో నిరంతర పర్యవేక్షణ ఉండేదని జార్జ్ మైఖేల్ పేర్కొన్నారు. ‘‘కానీ వరంగల్ నగరానికి రక్షణగా వృత్తాకారంలో మూడు కోట గోడల నిర్మాణం ఆశ్చర్యపరుస్తుంది. ఆ తరహా వ్యవస్థలు మరెక్కడా కనిపించవు. నగర నిర్మాణ సమయంలో 72 బురుజులు ఏర్పాటు చేసి 72 మందితో నాయక వ్యవస్థ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 45 బురుజులే కనిపిస్తున్నాయి. ఇక బహమనీలు, ఇతర ముస్లిం రాజులు ఓరుగల్లు నగరాన్ని ధ్వంసం చేశారు. ప్రస్తుతం ఒక్క కుష్ మహల్ మినహా అంతా ధ్వంస నిర్మాణాలే కనిపిస్తాయి. హిందూ ఆలయాలను కూల్చి ఆ శిథిలాలతో పెద్ద మసీదు నిర్మాణం ప్రారంభించినా, దాన్ని పూర్తి చేయలేదు. ఈ నగరానికి నిర్మించిన కీర్తి తోరణాలను చూసే కుతుబ్‌షాహీలు హైదరాబాద్‌లోని చార్మినార్‌కు నాలుగువైపులా చార్కమాన్లు నిర్మించారు..’’ అని చెప్పారు. ఓరుగల్లు గొప్ప ప్రణాళికాబద్ధ నగరమని, మరోసారి దానిని సందర్శించాలన్న ఆసక్తి ఉందని.. త్వరలోనే వెళ్తానని తెలిపారు. జార్జ్ మైఖేల్ -
పాప్ గాయకుడు జార్జ్ మైకేల్ కన్నుమూత
లండన్: ప్రముఖ పాప్ గాయకుడు జార్జ్ మైకేల్ (53) ఆదివారం బ్రిటన్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. నిద్రపోతున్న సమయంలో గుండెపోటు వచ్చి ఆయన మరణించారని జార్జ్ మేనేజర్ తెలిపారు. 1980ల్లో జార్జ్ పాటలు బాగా ప్రాచుర్యం పొందాయి. జార్జ్ చనిపోవడం వివరించలేనిదే కానీ అనుమానాస్పదం కాదని థేమ్స్ వ్యాలీ పోలీసులు చెప్పారు. శవ పరీక్ష పూర్తైన తర్వాత మిగతా వివరాలిస్తామన్నారు. 1963లో లండన్‌లో జన్మించిన మైకేల్ ‘వామ్!’పాప్ గ్రూప్‌తో ప్రయాణం ఆరంభించారు. తర్వాత దాన్నుంచి విడిపోయి సొంతంగా ఆల్బమ్‌లు రూపొందించారు. ఆయన నాలుగు దశాబ్దాల కెరీర్లో 10 కోట్లకు పైగా ఆల్బమ్స్ అమ్ముడయ్యాయి. -
జార్జ్ ‘గే’ మైకేల్ మరిలేరు!
1980ల్లో అత్యంత ఆదరణవున్న బ్రిటన్ పాప్ సూపర్ స్టార్ జార్జ్ మైకేల్ 53 ఏళ్ల వయసులోనే మరణించడం సంగీత ప్రపంచంలో విషాదాన్ని నింపింది. క్రిస్మస్ రోజు మధ్యాహ్నపు నిద్రలోనే గుండె ఆగి చనిపోయినట్టు ఆయన మేనేజర్ మైకేల్ లిప్మన్ తెలియజేశారు. ‘‘వివరించలేనిది కానీ అనుమానాస్పదమైన మృతి కాదు’’, అని థేమ్స్ వేలీ పోలీసులు ధ్రువీకరించారు. 1963లో లండన్‌లో జన్మించిన మైకేల్ ‘వామ్!’ పాప్ గ్రూప్‌తో ప్రయాణం ఆరంభించాడు. తర్వాత దాన్నుంచి విడిపోయి విడిగా కొనసాగాడు. ఆయన నాలుగు దశాబ్దాల కెరీర్లో 10 కోట్లకు పైగా ఆల్బమ్స్ అమ్ముడైనాయి. లాస్ట్ క్రిస్మస్, వేక్ మి అప్ బిఫోర్ యు గో–గో, కేర్లెస్ విస్పర్, లిజెన్ వితౌట్ ప్రెజ్యుడిస్, జీసస్ టు ఎ చైల్డ్ లాంటి పాటలు మైకేల్‌కు విపరీతమైన క్రేజ్‌ను తెచ్చిపెట్టాయి. మానవ హక్కుల కోసం ఉద్దేశించిన ప్రచారంలోనూ, క్షామపీడిత ఇథియోపియాకు బాసటగానూ మైకేల్ పాడాడు. ఇరాక్ మీద దాడి విషయంలో టోనీ బ్లెయిర్, జార్జ్ బుష్‌ను విమర్శిస్తూ ‘షూట్ ద డాగ్’ విడుదల చేశాడు. ఆయన చివరి ఆల్బమ్ సింఫోనికా 2014లో విడుదలైంది. మైకేల్ మతి పట్ల ఎల్టన్ జాన్, మడోన్నా లాంటి గాయకులు సంతాపం తెలియజేశారు. ‘నా స్నేహితుడా ఫేర్వెల్! మరో గొప్ప కళాకారుడు మనల్ని వదిలివెళ్లాడు’ అని మడోన్నా ట్వీట్ చేసింది. రెండు సార్లు మత్యుముఖంలోకి 2011లో నిమోనియా కారణంగా మృత్యువు అంచుల దాకా వెళ్లొచ్చాడు మైకేల్. చికిత్స సమయంలో ఆసుపత్రిలో కొంతకాలం అచేతంగా ఉండిపోయాడు. 2013లో మరోసారి వాహనంలోంచి పడి తలగాయం అయిన కారణంగా ఆసుపత్రికి ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్ చేయాల్సివచ్చింది. డ్రగ్స్, డ్రైవింగ్, సెక్స్ తప్పుడు కారణాలవల్ల ఎన్నోసార్లు పత్రికల్లో వార్తయ్యాడు మైకేల్. డ్రగ్స్ ఉన్నాయన్న కారణంగా 2006లో ఓసారి అరెస్టయ్యాడు. బాధ్యతారాహిత్య డ్రైవింగ్ వల్ల రెండు సార్లు కొంతకాలం డ్రైవింగ్ చేయకుండా నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. 1998లో కాలిఫోర్నియాలో టాయ్లెట్లో శృంగారం కారణంగా అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. విడుదలయ్యాక, స్టింగ్ ఆపరేషన్ ద్వారా తనను పట్టుకున్న పోలీసుల మీద వ్యంగ్యంగా ‘ఔట్‌సైడ్’ సింగిల్ తెచ్చాడు. యువకుడిగా తనను తాను బైసెక్సువల్‌గా చెప్పుకున్న మైకేల్ క్రమంగా తనను తాను ‘గే’గా గుర్తించాడు. అది తల్లి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందేమోనన్న భయంతో ఆ విషయాన్ని దాచిపెట్టాడు. ఆ కారణంగా తీవ్రమైన మనోవేదన అనుభవించాడు. క్రమంగా తన లైంగిక స్థితిని గౌరవంగా అంగీకరించడం మొదలుపెట్టాడు. ‘గే’గా ఉండటం విషయంలో నాకు నైతిక సమస్య ఏమీ లేదు, అని 2007లో ఓ ఇంటర్వూ్యలో చెప్పాడు.