పెను తీవ్రత చూపిస్తూ దూసుకొస్తున్న ఇర్మా దాడి నుంచి బయటపడేందుకు సిద్ధంగా ఉండాలని ఫోరిడా గవర్నర్ రిక్ స్కాట్ హెచ్చరించారు.
మియామి/అమెరికా: పెను తీవ్రత చూపిస్తూ దూసుకొస్తున్న ఇర్మా దాడి నుంచి బయటపడేందుకు సిద్ధంగా ఉండాలని ఫోరిడా గవర్నర్ రిక్ స్కాట్ హెచ్చరించారు. ఫ్లోరిడాలోని రెండు కోట్ల మంది ప్రజలు కూడా హరికేన్ ఇర్మా బారి నుంచి తప్పించుకునేందుకు తాము ఉంటున్న ప్రాంతాలను విడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు.
'వస్తున్న చాలా తుఫాను చాలా భయంకరమైనది.. బలమైనది.. మృత్యువులాంటిది. ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఇచ్చిన ఆదేశాలను ఎవరూ నిర్లక్ష్యం చేయకండి' అని ఆయన హెచ్చరించారు. ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి.. మనం ధ్వంసం అయ్యే ఇళ్లను తిరిగి నిర్మించుకోవచ్చు.. కానీ ప్రాణాలు పోతే అలా ఎప్పటికీ చేయలేం.. అందుకే ఫ్లోరిడా వాసులంతా ఇర్మా ప్రభావం నుంచి బయటపడేందుకు హెచ్చరికలు జారీ చేసిన ప్రాంతాలను వెంటనే ఖాళీ చేయండి. వస్తున్న తుఫాను మన రాష్ట్రం కంటే కూడా విశాలమైనది. ఇది పెద్ద మొత్తంలో ప్రాణనష్టం కలగజేయనుంది. తీర ప్రాంతాల పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంటుంది' అని స్కాట్ తీవ్రంగా హెచ్చరించారు.