ఆ ఐదుగురిని కలిసిన ఫిడెల్ క్యాస్ట్రో | Fidel Castro meets freed 'Cuban Five' | Sakshi
Sakshi News home page

ఆ ఐదుగురిని కలిసిన ఫిడెల్ క్యాస్ట్రో

Mar 3 2015 10:58 AM | Updated on Sep 2 2017 10:14 PM

క్యూబా ప్రముఖ కమ్యూనిస్టు నేత ఫిడేల్ క్యాస్ట్రో తనకు ఇష్టమైన ఓ ఐదుగురు వ్యక్తులను కలిశారు.

క్యూబా ప్రముఖ కమ్యూనిస్టు నేత ఫిడేల్ క్యాస్ట్రో తనకు ఇష్టమైన ఓ ఐదుగురు వ్యక్తులను కలిశారు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ మీడియాకు వెళ్లడించాడు. క్యూబా స్వాతంత్ర్యం కోసం అమెరికాతో హెర్నాండెజ్, రామన్ లాబనినో, ఫెర్నాండో గాంజలెజ్, రెనే గాంజలెజ్ అనే ఐదుగురు పోరాటయోధులు తమ జీవితాన్ని ధారపోశారని, జీవితం మొత్తం జైలులో గడిపారని వారి రాకకోసం ఎంతో కాలంగా ఎదురుచూశానని చెప్పారు. తన కోరిక ఇన్నాళ్లకు నెరవేరిందని, వారితో గడిపిన ఆ కొన్ని గంటలు మరువలేనివని తెలిపారు. అమెరికా జైల్లో ఉండొచ్చిన వారిని 73 రోజుల తర్వాత కలిసి, మెడల్స్తో సత్కరించానని చెప్పారు. 88 ఏళ్ల క్యాస్ట్రో గత ఫిబ్రవరి 28న వారిని కలిసినట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement