భారత్‌లో తప్పులో కాలేస్తున్న ఫేస్‌బుక్‌

Facebook Moderators Getting Wrong Interpretation Of Indian Laws: Report - Sakshi

న్యూయార్క్‌: వివాదాస్పద అంశాల తొలగింపు విషయంలో ఫేస్‌బుక్‌ తమ ఉద్యోగులకు జారీచేసిన మార్గదర్శకాల్లో లోపాలు ఉన్నాయని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక తెలిపింది. స్థానికంగా ఆయా దేశాల్లో చట్టాలు ఓరకంగా ఉంటే, ఫేస్‌బుక్‌ వాటిని మరోరకంగా అర్థం చేసుకుంటోందని అభిప్రాయపడింది.

ఇండియాలో హింసను రెచ్చగొట్టేలా దైవదూషణ చేస్తేనే నేరమనీ, విమర్శలు చేస్తే కాదని పేర్కొంది. అలాగే భారత్‌లో నినాదాల సందర్భంగా తరచుగా వాడే ఫ్రీ కశ్మీర్‌ అనే పదాన్ని ఆజాద్‌ కశ్మీర్‌గా పొరబడి తొలగిస్తున్నారంది. ఇండోనేసియాలో అగ్నిపర్వత బాధితులకు సాయం కోసం పెట్టిన పోస్టులను ఫేస్‌బుక్‌ తొలగించిందని తెలిపింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top