ఏలియన్స్‌ను దాచేస్తున్నారు.. ఎందుకు?

Ex-NASA Scientist Says Aliens Exist - Sakshi

ఏడున్నర దశాబ్దాలుగా చిక్కక.. దొరక్క... ఊరిస్తూ మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిన అంశమే ఏలియన్స్ (గ్రహాంతర వాసులు). 95 కాంతి సంవత్సరాల దూరం నుంచి అంతుపట్టని రేడియో సిగ్నల్స్‌. భూమి మీద మనుషులు ఉన్నట్టుగానే ఇతర గ్రహాలపై కూడా జీవరాశులు ఉన్నాయన్న వాదన.. పైగా ఖగోళ మేధావి స్టీఫెన్‌ హాకింగ్‌ లాంటి వాళ్ల హెచ్చరికలు... నిజమో? నకిలీవో? స్పష్టంలేని మీడియా కథనాలు...  ఇవన్నీకొందరిలో ‘ఏలియన్స్‌’ పట్ల విపరీతమైన ఆస​క్తిని రేకెత్తిస్తుంటాయి.

ఇదిలా ఉంటే నాసా మాజీ శాస్త్రవేత్త, ప్రొఫెసర్‌ కెవిన్‌ నూథ్‌(ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్‌ అల్బేనీలో పని చేస్తున్నారు) సంచలన ఆరోపణలు చేశారు. ఏలియన్ల మనుగడ గురించి తెలిసి కూడా నాసా.. గోప్యత ఎందుకు ప్రదర్శిస్తోందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... ‘2002 నాసా కాంటాక్ట్‌ కాన్ఫరెన్స్‌లో జరిగిన విషయం ఇప్పటికీ నాకు గుర్తుంది. గ్రహంతరవాసుల అంశంపైనే శాస్త్రవేత్తలమంతా ప్రధానంగా చర్చించాం. అప్పటికే నాసా సేకరించిన సమాచారం గందరగోళంగా ఉంది. ఏలియన్ల మనుగడ నిజమన్న భావనను కొందరు నొక్కివక్కానిస్తే.. మరికొందరు నాన్‌సెన్స్‌ అని కొట్టేపారేశారు. మేం కొందరం సభ్యులం తటస్థంగా  ఉన్నాం. కానీ, అందరిలో ఏకాభిప్రాయం ఒక్కటే. ప్రజల్లో ఆసక్తి, అనాసక్తి అన్న అంశాలను పక్కనపెడితే వాటి మనుగడపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం నాసాకు ఉంది. ఆకాశంలో కనిపించి.. అదృశ్యమయ్యే యూఎఫ్ఓల మాటేంటి? అవి గ్రహాంతర వాసుల నౌకలా? కాదా?  అక్కడక్కడ భూ మైదానాల్లో ఏర్పడే మిస్టరీ ముద్రలేంటి? సందేశాలు పంపిన దాఖలాల సంగతేంటి? ఈ రహాస్యాలన్నీంటికి నాసా దగ్గర సమాధానాలు ఉన్నాయి. కానీ, ఎందుకు దాస్తున్నారో ఇప్పటికీ అర్థం కావట్లేదు’ అని ఆయన ఆరోపించారు.  

గ్రహాంతర వాసులతో మనుషులకు ప్రమాదం నిజంగానే పొంచి ఉందా?  ఒకవేళ అనుసంధానం అయితే అవి కత్తి దూస్తాయా..? చేయి చాస్తాయా?  ఏలియన్స్ ఉనికి చుట్టూ ఉన్న వాదన సంగతి పక్కనపెడితే.. ప్రజల్లో పెరిగిపోయిన అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఖచ్ఛితంగా ఉంది అని కెవిన్‌ తెలిపారు. భూమి మీద మనుషులు ఉన్నట్టుగానే ఇతర గ్రహాలపై కూడా జీవరాశులు ఉన్నట్టు సాక్ష్యాధారాలతోసహా చూపిస్తామని నాసా ఇది వరకే ప్రకటించింది. ఏలియన్ల విషయంలో మరో 20 ఏళ్లలో వాటి జాడను ప్రజల ముందు ఉంచుతామని తెలిపింది కూడా. అయితే అందుకోసం జరిగే పరిశోధనల విషయంలో  హాకింగ్ హెచ్చరించినట్టు ఆచితూచి అడుగెయ్యటం మంచిదన్న వాదన వినిపిస్తోంది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top