బ్రెగ్జిట్‌ గడువు అక్టోబర్‌ 31 వరకు పెంపు | EU Extend Brexit Deadline To 31 October | Sakshi
Sakshi News home page

బ్రెగ్జిట్‌ గడువు అక్టోబర్‌ 31 వరకు పెంపు

Apr 12 2019 7:56 AM | Updated on Jul 11 2019 8:00 PM

EU Extend Brexit Deadline To 31 October - Sakshi

లండన్‌: యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ) నుంచి బ్రిటన్‌ విడిపోయేందుకు ఉద్దేశించిన బ్రెగ్జిట్‌ గడువు మరోసారి పెరిగింది. బ్రెగ్జిట్‌ గడువు ఏప్రిల్‌ 12తో ముగియనున్న నేపథ్యంలో మరో 6 నెలలు అంటే అక్టోబర్‌ 31 వరకూ పొడిగిస్తున్నట్లు ఈయూ తెలిపింది. ఈ గడువులోగా బ్రెగ్జిట్‌ బిల్లును బ్రిటన్‌ పార్లమెంటు ఆమోదించేలా చర్యలు తీసుకోవాలని ఆ దేశ ప్రధాని థెరెసా మేకు సూచించింది. బెల్జియంలోని బ్రస్సెల్స్‌లో గురువారం సమావేశమైన 28 ఈయూ దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. నిబంధనల మేరకు వచ్చే నెల 23న జరిగే ఈయూ ఎన్నికల్లో బ్రిటన్‌ పాల్గొనాల్సి ఉంటుందని యూరోపియన్‌ కమిషన్‌ అధ్యక్షుడు జీన్‌క్లౌడే జంకర్‌ తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement