మూడో ప్రపంచ యుద్ధం ఎలా వస్తుందంటే.. | Elon Musk says AI could lead to third world war | Sakshi
Sakshi News home page

మూడో ప్రపంచ యుద్ధం ఎలా వస్తుందంటే..

Sep 5 2017 6:01 PM | Updated on Aug 20 2018 4:52 PM

మూడో ప్రపంచ యుద్ధం ఎలా వస్తుందంటే.. - Sakshi

మూడో ప్రపంచ యుద్ధం ఎలా వస్తుందంటే..

కృత్రిమ మేథస్సు ఉన్న రోబోల మధ్య పోటీ, పైచేయి సాధించటానికి జరిగే ప్రయత్నంలో మూడో ప్రపంచ యుద్ధం సంభవిస్తుందని టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ సంస్థల సీఈవో ఎలాన్‌ మస్క్‌ జోస్యం చెప్పారు.

సాక్షి, న్యూయార్క్ : కృత్రిమ మేథస్సు ఉన్న రోబోల మధ్య పోటీ, పైచేయి సాధించటానికి జరిగే ప్రయత్నంలో మూడో ప్రపంచ యుద్ధం సంభవిస్తుందని టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ సంస్థల సీఈవో ఎలాన్‌ మస్క్‌ జోస్యం చెప్పారు. అయితే, కృత్రిమ మేథస్సు రోబోల రూపకల్పన రేసులో అమెరికా, చైనా, ఇండియా ముందుంటాయని అన్నారు. దాదాపు అన్ని దేశాలూ కృత్రిమ మేథస్సుపై పరిశోధనలు జరుపుతున్నాయని ఆయన తెలిపారు. ఈ రంగంలో ఉండే ప్రైవేట్‌ సంస్థలను సైతం ప్రభుత్వాలు నియంత్రించి తమ ఆధీనంలో ఉంచుకుంటాయని ఆయన చెప్పుకొచ్చారు.

మూడో ప్రపంచ యుద్ధం కారణంగా మానవ నాగరికతకు ముప్పు ఉన్న దేశాల జాబితాలో ఉత్తర కొరియా మాత్రం లేదని చెప్పారు. రష్యాతోపాటు అన్ని దేశాలకు కృత్రిమ మేథస్సు కీలకమైందని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ చేసిన ప్రకటనపై ఆయన సోమవారం పలు ట్వీట్‌లు చేశారు.

యుద్ధంలో విజయం సాధించటానికి అకస్మాత్తుగా చేపట్టే దాడులే కీలకమని కృత్రిమ మేథస్సు రోబోలు నమ్ముతాయని, మూడో ప్రపంచ యుద్ధానికి ఈ నమ్మకమే కారణమని ఆయన చెప్పారు. అయితే, ఎలాన్‌ మస్క్‌ ట్వీట్లను ఫేస్‌బుక్‌ సీఈవో జుకర్‌బర్గ్‌ ఖండించారు. బాధ్యతారాహిత్యంతో కూడిన వ్యాఖ్యలని ఆయన పేర్కొన్నారు. దీనిపై ఎలాన్‌ మస్క్‌ స్పందిస్తూ జుకర్‌బర్గ్‌కు ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌పై తెలిసింది కొంత మాత్రమేనని వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement