కాఫీతో ఆ రిస్క్ సగానికి పైగా తగ్గుతోంది! | Sakshi
Sakshi News home page

కాఫీతో ఆ రిస్క్ సగానికి పైగా తగ్గుతోంది!

Published Sun, Feb 28 2016 5:40 PM

కాఫీతో ఆ రిస్క్ సగానికి పైగా తగ్గుతోంది!

లండన్: కాఫీ ప్రియులకు శుభవార్త. మీరు రోజు మామూలుగా తాగేదానికన్నా అదనంగా మరో రెండు కప్పుల కాఫీని లాగించమని చెబుతున్నారు పరిశోధకులు. దీని ద్వారా కాలేయానికి సంబంధించిన ప్రాణాంతకమైన వ్యాధులు సగానికి పైగా తగ్గుతాయని చెబుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. శరీరంలో ఆల్కహాల్ మోతాదు మించడం, హెపటైటిస్ సీ లాంటి వైరల్ వ్యాధుల భారిన పడటం ద్వారా కాలేయం(లివర్) తీవ్రంగా ప్రభావితం అవుతుంది. ఇలా దీర్ఘకాలంగా కాలేయ వ్యాధులు ఉన్నవారిలో అది లివర్ క్యాన్సర్గా మారి ప్రాణాంతకంగా తయారవుతోంది. అయితే ఈ ముప్పును కాఫీ సగానికి పైగా తగ్గిస్తోందని లండన్లోని సౌతాంప్టన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల బృంధం తాజాగా తేల్చింది. సుమారు 5 లక్షల మందిని పరిశీలించి ఈ ఫలితాలను వెల్లడించారు. లివర్ సిర్రోసిస్ వ్యాధికి కాఫీ మంచి విరుగుడులా పనిచేస్తుందని పరిశోధకులు తెలిపారు. కాఫీతో కలిగే ఈ ప్రయోజనాలను తెలుసుకోవడం ద్వారా లివర్కు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్న వారికి మంచి ఉపయోగాలున్నాయని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ఒలివర్ కెన్నడీ వెల్లడించారు.

Advertisement
 
Advertisement