ట్రంప్‌పై అంతర్జాతీయ సంస్థ చీఫ్‌ ప్రశంసలు | Donald Trump good for US economy: IMF chief | Sakshi
Sakshi News home page

ట్రంప్‌పై అంతర్జాతీయ సంస్థ చీఫ్‌ ప్రశంసలు

Feb 12 2017 5:04 PM | Updated on Aug 25 2018 7:50 PM

ట్రంప్‌పై అంతర్జాతీయ సంస్థ చీఫ్‌ ప్రశంసలు - Sakshi

ట్రంప్‌పై అంతర్జాతీయ సంస్థ చీఫ్‌ ప్రశంసలు

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు తొలిసారిగా ఓ అంతర్జాతీయ సంస్థ చీఫ్‌ నుంచి ప్రశంసలు దక్కాయి.

న్యూయార్క్‌: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు తొలిసారిగా ఓ అంతర్జాతీయ సంస్థ చీఫ్‌ నుంచి ప్రశంసలు దక్కాయి. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి అమెరికా ఆర్థిక వ్యవస్థకు డోనాల్డ్‌ ట్రంప్‌ మంచి చేశాడని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) చీఫ్‌ క్రిస్టీన్‌ లగార్డే అన్నారు. అతడు స్వల్పకాలంలోనే అమెరికా ఆర్థిక వ్యవస్థను కుదుట పరిచాడని ఇది మంచి పరిణామం అన్నారు.

అయితే, డాలర్‌ను పటిష్టత చర్యలు, వడ్డీ రేట్ల పెంపు అనే అంతర్జాతీయ వర్తక వ్యాపారంపై ప్రభావాన్ని చూపుతుందని తెలిపారు. అమెరికాలో మౌలిక వసతుల ఏర్పాటు రంగంలో రెట్టింపు చేయనున్న పెట్టుబడి సంస్కరణలు, పన్ను సంస్కరణలు అమెరికా ఆర్థిక వ్యవస్థకు మరింత బూస్టింగ్‌ ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దుబాయ్‌లో జరిగిన వరల్డ్‌ గవర్నమెంట్‌ శిఖరాగ్ర సదస్సులో ఆమె ఈ విషయాలు చెప్పారు. అయితే, ట్రంప్‌ విదేశాంగ విధానాల జోలికి మాత్రం ఆమె వెళ్లలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement