అలా ఉంటే సెక్సువల్ లైఫ్ కూడా సూపర్..! | Couples should be friends first – Here’s why | Sakshi
Sakshi News home page

అలా ఉంటే సెక్సువల్ లైఫ్ కూడా సూపర్..!

May 9 2016 10:28 AM | Updated on Apr 4 2019 5:12 PM

అలా ఉంటే సెక్సువల్ లైఫ్ కూడా సూపర్..! - Sakshi

అలా ఉంటే సెక్సువల్ లైఫ్ కూడా సూపర్..!

భర్త అంటే ఓ భార్యకు మరో రూపంలో తోడుగా ఉండే తండ్రి. భార్యంటే ఓ భర్తకు మరో రూపంలో ఉండే తల్లి. ఈ సూక్ష్మ భేదం తెలియక ఎంతోమంది పొద్దున లేచినప్పటి నుంచి చెరో కల్పిత ప్రపంచంలో ఇరుక్కుపోయి ఒకరినొకరు తిట్టిపోసుకుంటుంటారు.

లండన్: భర్త అంటే ఓ భార్యకు మరో రూపంలో తోడుగా ఉండే తండ్రి. భార్యంటే ఓ భర్తకు మరో రూపంలో ఉండే తల్లి. ఈ సూక్ష్మ భేదం తెలియక ఎంతోమంది పొద్దున లేచినప్పటి నుంచి చెరో కల్పిత ప్రపంచంలో ఇరుక్కుపోయి ఒకరినొకరు తిట్టిపోసుకుంటుంటారు. చిన్నచిన్న విషయాలకే నువ్వంటే నువ్వంటూ తెగ వాదులాడుతుంటారు. ఈ వాదనల్లో ఇరుక్కొని కొందరు విడాకులు అంటూ చెరో దిక్కుకు చేరుకునే ప్రయత్నం చేస్తారే తప్ప కనీసం ఒకరితో ఒకరు సమస్యపై ఏనాడు చర్చించుకోరు.

ఈ సమయంలో మధ్య వర్తుల ప్రలోభాలకే ఎక్కువ గురవుతుంటారు. ఇంకొందరైతే మాత్రం ఇలా అవకుండా ఉండాల్సిందని అనుకుంటారు. మరికొందరు మాత్రం తాము భార్యభర్తలమే అయినా స్నేహితులుగా ఉంటే ఎంతో బావుంటుంది కదా అనుకుంటారు. అలా స్నేహితులుగా ఉండాలనుకునే వారికోసం అమెరికాకు చెందిన మనస్తత్వ శాస్త్రవేత్తలు పలు విషయాలు చెబుతున్నారు. ఏ భార్యభర్తలైతే స్నేహితులుగా ఉంటారో వారి బంధం చాలా బలంగా ఉంటుందని, లైంగిక జీవితం కూడా అద్భుతంగా ఉంటుందని, సుదీర్ఘకాలం వారి జీవితం హాయిగా గడిచిపోతుందని చెబుతున్నారు.

ఇండియానాలోని లారా వాండర్ డ్రిఫ్ట్ యూనివర్సిటీకి చెందిన అధ్యయనకారులు మొత్తం 184మందిని వారు 16 నెలలుగా ఎలా ఉంటున్నారని, వారు అలా ఉండటానికి గల కారణాలు ఏమిటని ప్రశ్నించగా వారంతా స్నేహమే అని తెలిపారు. స్నేహితులుగా మారిపోతే గడ్డుసమస్యలు కూడా ఇట్టే మాయమైపోతాయని.. అందుకే భార్యభర్తలు ముందు స్నేహితులుగా మారిపోవాలని వారు సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement