ఆస్కార్ అవార్డులు ఇవీ... | Complete list of ascar award winners 2015 | Sakshi
Sakshi News home page

ఆస్కార్ అవార్డులు ఇవీ...

Feb 23 2015 2:48 PM | Updated on Sep 2 2017 9:47 PM

ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది.

ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం అమెరికాలోని లాస్ ఎంజెల్స్లో హాలీవుడ్ డాల్బీ థియేటర్లో ఈ వేడుగ అట్టహాసంగా ప్రారంభమైంది. 87వ సారి జరిగిన ఈ అవార్డుల కార్యక్రమంలో ఉత్తమ నటుడిగా ఎడ్డీ రెడ్ మెన్, ఉత్తమ నటిగా జూలియన్ మూరే, ఉత్తమ దర్శకత్వ అవార్డును అలెజాండ్రో గాంజలెజ్ ఇనారిట్టు అందుకున్నారు. దిగ్రాండ్ బుడాపెస్ట్ హోటల్, బర్డ్ మేన్ చిత్రాలు నాలుగు విభాగాల్లో విప్లాష్ చిత్రం మూడు విభాగాల్లో ఆస్కార్ పురస్కారాలు దక్కించుకున్నాయి. ప్రపంచంలోని పలువురు ప్రముఖులు, నటీ నటుల ఈ వేడుకలకు హాజరయ్యారు.   

87వ ఆస్కార్ అవార్డులు ఇవీ...

ఉత్తమ చిత్రం: బర్డ్మేన్
ఉత్తమ నటుడు: ఎడ్డీ రెడ్ మైనే (ది థీయరీ ఆఫ్ ఎవరీ థింగ్)
ఉత్తమ నటి: జూలియన్ మూరే (స్టిల్ అలైస్)
ఉత్తమ దర్శకుడు: అలెజాండ్రో గాంజలెజ్ ఇనారిట్టు (బర్డ్మేన్)
ఉత్తమ సహాయ నటుడు: జేకే సైమన్స్ (విప్లాష్)
ఉత్తమ సహాయ నటి: పాట్రికియా ఆర్క్విటే (బాయ్ హుడ్)
ఉత్తమ విదేశీ చిత్రం: ఐదా
ఉత్తమ రచనా- అడాప్టడ్ స్క్రీన్ ప్లే: గ్రహం మూరే, ది ఇమిటేషన్ గేమ్
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: అలెజాండ్రో జీ ఇనారిట్టు, నికోలాస్ గియాకోబోన్, అలెగ్జాండర్ డైన్లారిస్, ఆర్మాండో బో, (బర్డ్మేన్)
ఉత్తమ సినిమాటోఫోగ్రపీ: ఇమ్మాన్యుయెల్ లూబెజ్కీ(బర్డ్మేన్)
ఉత్తమ సంగీతం-ఒరిజినల్ స్కోర్: అలెగ్జాండ్రె డెస్ప్లాట్
ఉత్తమ మేకప్ అండ్ హెయిర్ స్టైల్: ఫ్రాన్సెస్ హన్నాన్ అండ్ మార్క్ కొలియర్ (ది గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్)
ఉత్తమ కాస్ట్యుమ్ డిజైన్: మిలేనా కెనానిరో (ది గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్)
ఉత్తమ ఒరిజినల్ సాంగ్: జాన్ స్టీఫెన్స్ లోన్నీ లిన్ (గ్లోరీ, సెల్మా)
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: పాల్ ఫ్రాంక్లిన్, ఆండ్రూ లాక్లీ, ఇయాన్ హంటర్ అండ్ స్కాట్ ఫిషర్ (ఇంటర్ స్టెల్లర్)
ఉత్తమ డాక్యుమెంటరీ ఫ్యూచర్: సిటిజన్ ఫోర్
ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్: టామ్ క్రాస్ విప్లాష్
ఉత్తమ షార్ట్ ఫిల్మ్-లైవ్ యాక్షన్: ది ఫోన్ కాల్
ఉత్తమ షార్ట్ ఫిల్మ్-యానిమేటెడ్: ఫియస్ట్
ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: బిగ్ హీరో 6
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement