రష్యాకు ఆంత్రాక్స్ భయం | Climate Change Blamed for the Anthrax Outbreak in Russia | Sakshi
Sakshi News home page

రష్యాకు ఆంత్రాక్స్ భయం

Aug 2 2016 2:08 PM | Updated on Sep 4 2017 7:30 AM

రష్యాకు ఆంత్రాక్స్ భయం పట్టుకుంది. ఈ వ్యాధితో ఓ 12 ఏళ్ల బాలుడు చనిపోయాడు.

మాస్కో: రష్యాకు ఆంత్రాక్స్ భయం పట్టుకుంది. ఈ వ్యాధితో ఓ 12 ఏళ్ల బాలుడు చనిపోయాడు. సుమారు 70 మంది ఆసుపత్రిపాలయ్యారని సోమవారం అధికారులు ప్రకటించారు. రాజధాని మాస్కోకు ఈశాన్యంగా 2 వేల కి.మీల దూరంలోని యామలో-నెనెటెస్కై ప్రాంతంలోని సంచార దుప్పి కాపలాదారుల్లో 9 మందికి ఈ వ్యాధి సోకిందని గుర్తించారు.

1941 తరువాత ఇక్కడ ఆంత్రాక్స్ ప్రబలడం ఇదే ప్రథమం. వాతావరణ మార్పులు కారణంగానే ఆంత్రాక్స్  వచ్చిందని అధికారులు భావిస్తున్నారు. ఆంత్రాక్స్ వ్యాప్తి చెందకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement