బతికుండగానే పూడ్చిపెట్టారు! | Buried while alive | Sakshi
Sakshi News home page

బతికుండగానే పూడ్చిపెట్టారు!

May 25 2017 10:36 PM | Updated on Sep 5 2017 11:59 AM

బతికుండగానే పూడ్చిపెట్టారు!

బతికుండగానే పూడ్చిపెట్టారు!

అది హుండూరస్‌లోని లా ఎంట్రాడా అనే ప్రాంతంలో ఓ సాధారణ కుటుంబం.

అది హుండూరస్‌లోని లా ఎంట్రాడా అనే ప్రాంతంలో ఓ సాధారణ కుటుంబం. అందరూ రోజువారీ కార్యకలాపాలు అయిపోయాక ఎప్పటిలాగే విశ్రమించారు. నైసీ పరేజ్‌ అనే 16 ఏళ్ల యువతి కూడా నిద్రకు ఉపక్రమించింది. మధ్యరాత్రి బాత్రూంకి వెళ్లి ఒక్కసారిగా అరుస్తూ కుప్పకూలిపోయింది. భయబ్రాంతులకు గురైన తల్లిదండ్రులు స్థానిక మంత్రగాడిని పిలిపించారు. పరేజ్‌ తల్లిదండ్రులకు మూడవిశ్వాసాలు అధికం. పరేజ్‌ పరిస్థితిని గమనించిన ఆ మంత్రగాడు ఈమెను ఆత్మ వశం చేసుకుందని బతకడం చాలా కష్టమని తేల్చాడు. పరేజ్‌ బంధువులు మూడు గంటల తర్వాత ఆమెను  ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె మరణించిందని డాక్టర్లు ధృవీకరించారు.

మరుసటి రోజు అరుపులు
భార్య అంటే అమితమైన ప్రేమ ఉన్న గోంజాల్స్‌ పరేజ్‌ మరణించిందన్న వార్తను జీర్ణించుకోలేక పోయాడు. ఆమె సమాధిపై పడి చిన్నపిల్లాడిలా ఏడుస్తుండగానే గోంజాల్స్‌కు కాపాడండి! అన్న అరుపులు వినిపించాయి. అరుపులు భార్య సమాధి నుంచే వస్తున్నాయని ఆశ్చర్యపోయాడు. పరుగున వచ్చిన గోంజాల్స్‌ జరిగిన విషయాన్ని ఇంట్లోవారికి  తెలియజేశాడు.

పెద్దలు వారిస్తున్నా...
స్మశానం వద్దకు వెళ్లిన కుటుంబసభ్యులు పరేజ్‌ సమాధిని పగులగొట్టి పరేజ్‌ శవాన్ని బయటకు తీయించాడు. పరేజ్‌ ముఖంపై రక్తపుగాట్లు ఉన్నాయి. అంతేకాదు ఆమె చేతివేళ్లు మొత్తం పగిలిపోయి ఉన్నాయి. శవపేటిక మూత కూడా లోపలి భాగంలో ధ్వంసమై ఉంది. వెంటనే పరేజ్‌ను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అన్ని పరీక్షలు చేసిన డాక్టర్లు మరణించి కేవలం కొద్ది సమయం మాత్రమే అవుతుందని చెప్పారు. అయితే మెదట తాత్కలికంగా ఆమె గుండె ఆగిపోవడంతో చనిపోయినట్లు మొదటగా భావించినట్లుందని డాక్టర్లు ఊహించారు. ఏదీ ఏమైనప్పటికీ పరేజ్‌ చనిపోయిన తీరు చాలా దురదృష్టకరం.

పిచ్చివాడైన భర్త...
పరేజ్‌ మరణంతో భర్త రూడీ గోంజాల్స్‌ పిచ్చిపట్టనవాడిగా మారిపోయాడు. త్వరలో తమకు ఒక బిడ్డ పుట్టబోతుందన్న ఆశలతో ఉన్న గోంజాల్స్‌కు పరేజ్‌ మరణంతో జీవచ్చవంలా మారాడు. ఆసుపత్రి నుంచి పరేజ్‌ శవాన్ని స్థానిక స్మశానవాటిలోఖననం చేశారు.

సాక్షి స్కూల్‌ ఎడిషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement