కరోనా అలర్ట్‌ : ప్రముఖ నటుడు మృతి | British Comedian Tim Brooke Taylor No More | Sakshi
Sakshi News home page

బ్రిటన్‌ కమెడియన్‌ కన్నుమూత

Apr 13 2020 2:50 PM | Updated on Apr 13 2020 2:50 PM

British Comedian Tim Brooke Taylor No More   - Sakshi

కోవిడ్‌-19తో బ్రిటన్‌ నటుడు కన్నుమూత

లండన్‌ : కరోనా వైరస్‌తో బాధపడుతూ ప్రముఖ నటుడు, బ్రిటన్‌ కమెడియన్‌ టిమ్‌ బ్రూక్‌ టేలర్‌ (75) కన్నుమూశారు. బ్రూక్‌ టేలర్‌ గత నాలుగు దశాబ్ధాలుగా బీబీసీ రేడియో 4కి రెగ్యులర్‌ ప్యానెలిస్ట్‌గా వ్యవహరించారు. 1970ల్లో బుల్లితెరపై వచ్చిన ది గుడీస్‌ షోతో ఆయన విశేష ప్రాచుర్యం పొందారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో బ్రూక్‌ టేలర్‌ నటుడిగా తన కెరీర్‌ ప్రారంభించారు. ఇక మహమ్మారి బారి నుంచి ఆయన కోలుకుంటున్నారని భావిస్తున్న తరుణంలో ప్రాణాంతక వైరస్‌తో మరణించారనే వార్త బ్రూక్‌ టేలర్‌ అభిమానులను కలవరపరుస్తోంది. టేలర్‌ తన హాస్యంతో వివిధ తరాలకు చెందిన ప్రజలను కడుపుబ్బా నవ్వించేవారని ఆయన మరణం హాస్యప్రియులకు తీరని లోటని ప్రముఖ రచయిత సిమన్‌ బ్లాక్‌వెల్‌ ట్వీట్‌ చేశారు.

చదవండి : రేపు ఉదయం పది గంటలకు ప్రధాని ప్రసంగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement