జీతం అడిగితే చేయి నరికేసింది..! | Boy's hand chopped off in Pakistan for asking salary | Sakshi
Sakshi News home page

జీతం అడిగితే చేయి నరికేసింది..!

May 10 2017 6:40 PM | Updated on Sep 5 2017 10:51 AM

జీతం అడిగితే చేయి నరికేసింది..!

జీతం అడిగితే చేయి నరికేసింది..!

వేతనం అడిగినందుకు 13 ఏళ్ల బాలుడి చేయి నరికేసిన సంఘటన పాకిస్తాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్సులో చోటు చేసుకుంది.

లాహోర్‌: వేతనం అడిగినందుకు 13 ఏళ్ల బాలుడి చేయి నరికేసిన సంఘటన పాకిస్తాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్సులో చోటు చేసుకుంది. గత వారం ఈ ఘటన జరగ్గా.. తాజాగా బాలుడు ఇర్ఫాన్‌ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సఫ్దరాబాద్‌లో నివాసముంటున్న షఫ్కాత్‌ బిబీ ఇంట్లో నెలకు రూ.3 వేల వేతనానికి ఇర్ఫాన్‌ పనిలో చేరాడు. పనిలో చేరి నెల రోజులు పూర్తి కావడంతో వేతనం ఇవ్వాలంటూ ఇర్ఫాన్‌ బీబీని కోరాడు. కోపగించుకున్న ఆమె జీతం అడగడం కాదు.. పని ఎలా చేయాలో తెలుసుకో.. అంటూ పచ్చి గడ్డిని నరకడానికి ఉపయోగించే మిషన్‌లో బాలుడి చేయి పెట్టింది.

దీంతో బాలుడి చేయి తెగి పోయింది. బీబీపై కేసు నమోదు చేయడానికి పోలీసులు అంగీకరించకపోవడంతో బాధితుడి తల్లి స్ధానిక న్యాయస్ధానాన్ని ఆశ్రయించింది. నిందితురాలు, ఆమె ఇద్దరు సోదరులపై కేసు నమోదు చేయాలనే కోర్టు తీర్పుతో కదిలిన పోలీసులు వారిలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పంజాబ్‌ ప్రావిన్సు ముఖ్యమంత్రి తనకు ఓ రిపోర్టు ఇవ్వాలని పోలీసులను ఆదేశించారు. బాలుడిన వేధించిన వారందరిని చట్టం శిక్షిస్తుందని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement